Prabhas: 'కార్తికేయ2' సినిమాపై ప్రభాస్ రియాక్షన్ - పోస్ట్ వైరల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'కార్తికేయ2' సినిమాను ప్రశంసిస్తూ.. చిత్రబృందానికి కంగ్రాట్స్ చెప్పారు.
యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ2' సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఫైనల్ గా ఆగస్టు 13న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సత్తా చాటుతోంది. సినీ ప్రేక్షకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా 'కార్తికేయ2' సక్సెస్ పై స్పందిస్తున్నారు.
మొత్తం యూనిట్ ను అభినందిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాను ప్రశంసిస్తూ.. చిత్రబృందానికి కంగ్రాట్స్ చెప్పారు. 'కార్తికేయ2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన మొత్తం యూనిట్ కి అభినందనలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టారు. అది చూసిన నిఖిల్.. ఆ పోస్ట్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ప్రభాస్ కి థాంక్స్ చెప్పారు.
Prabhas Bhai 🙏🏽🙏🏽🙏🏽 thanks for the Wishes🙏🏽🙏🏽🙏🏽🔥 #Karthikeya2 team is overwhelmed with your message to us 🔥🔥🔥#Karthikeya2Hindi pic.twitter.com/2bDBcOLMnC
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 17, 2022
'కార్తికేయ2' లేటెస్ట్ కలెక్షన్స్..
మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో ఏరియాల వారీగా తెలుసుకుందాం!
నైజాం - రూ. 5 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 1.79 కోట్లు
సీడెడ్ - రూ. 2.14 కోట్లు
నెల్లూరు - రూ. 47 లక్షలు
గుంటూరు - రూ. 1.30 కోట్లు
కృష్ణా జిల్లా - రూ. 1.02 కోట్లు
తూర్పు గోదావరి - రూ. 1.16 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 83 లక్షలు
'కార్తికేయ 2'లో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) 'వైవా' హర్ష చెముడు హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు. ఆదిత్యా మీనన్ (Aditya Menon), తులసి, ప్రవీణ్ (Comedian Praveen), సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) సంయుక్తంగా నిర్మించారు.
Also Read : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?
Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ