News
News
X

Rajasthna Crime News: రాజస్థాన్ లో దారుణ ఘటన... నలుగురు కుమార్తెలను హత్యచేసిన తండ్రి...

కరోనాతో భార్య చనిపోయింది. నలుగురు పిల్లల్ని చూసుకునేందుకు మరదలితో పెళ్లి చేయాలని కోరాడు. అత్తమామలు అందుకు నిరాకరించడంతో పిల్లలకి విషం ఇచ్చి హత్య చేశాడో ఓ వ్యక్తి.

FOLLOW US: 

మరదలితో పెళ్లికి నిరాకరించారని దారుణానికి ఒడిగట్టాడో ఓ వ్యక్తి. తన నలుగురు కుమార్తెలను నీటి ట్యాంక్‌లో తోసేసి హత్య చేశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నలుగురు చిన్నారులు పదేళ్లలోపు వారే. ఈ విషాద ఘటన రాజస్థాన్​లోని బాడ్​మేర్​లో చోటుచేసుకుంది. పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కరోనా కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మృతి చెందింది. కుమార్తెల కోసం తల్లి అవసరమని భావించిన పుర్ఖారామ్‌ భార్య చెల్లిని ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను కోరాడు. కానీ మరదలను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించలేదు. 

Also Read: Whistiling village Kongthong: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...

పిల్లలకు విషం ఇచ్చి..

పెళ్లికి నిరాకరించడంతో మనస్తపానికి గురైన పుర్ఖారామ్‌... తన కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర)లతో విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్​లో తోసేశాడు. తర్వాత పుర్ఖారామ్ కూడా అందులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడు వాటర్​ ట్యాంక్​లోకి దూకుతున్నప్పుడు పక్కింటి వారు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారి ఓం ప్రకాశ్‌ ఈ ఘటనపై వివరాలు తెలిపారు. నలుగురు పిల్లలను నీటిలో తోసేయగా వారు నీటిలో మునిగిపోయి చనిపోయారు. మృతదేహాలను ట్యాంక్ నుంచి బయటకు తీసి సమీపంలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్​ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

News Reels

Also Read: AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్టు... సాంబశివరావును అరెస్టు చేసిన సీఐడీ... 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

భార్య చనిపోవడంతో..

ఈ కేసుకు సంబంధించిన కుటుంబసభ్యులను విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పుర్ఖారామ్ అత్తమామలను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.  వారి స్టేట్‌మెంట్‌లు తీసుకుంటామన్నారు. నిందితుడి పరిస్థితిని మెరుగుపరచడంపై అతని వాంగ్మూలం కూడా నమోదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజుల క్రితం భార్య చనిపోవడంతో పుర్ఖారామ్ షాక్‌కు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులే ఈ విషాద సంఘటనకు దారితీసిందంటున్నారు. 

Also Read: Tamil Nadu: వాననీటిలో చిక్కుకున్న కారు.. వైద్యురాలి మృతి.. తమిళనాడులో దారుణం..

Also Read: Case On TDP Leaders: చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే దాడి.. 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు

Published at : 19 Sep 2021 09:54 AM (IST) Tags: Abp News Crime News Rajasthna crime father killed four daughter

సంబంధిత కథనాలు

Indian Navy Agniveer Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Indian Navy Agniveer Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

అర్ధరాత్రి అలజడి! టీడీపీ లీడర్‌ని చితకబాదిన వైసీపీ నేతలు - పోలీసుల ప్రేక్షక పాత్ర?

అర్ధరాత్రి అలజడి! టీడీపీ లీడర్‌ని చితకబాదిన వైసీపీ నేతలు - పోలీసుల ప్రేక్షక పాత్ర?

MLA Anil Comments: టోపీ పెట్టుకుంటే తప్పేంటి, వావర్ స్వామి ముస్లిం కాదా? మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలు

MLA Anil Comments: టోపీ పెట్టుకుంటే తప్పేంటి, వావర్ స్వామి ముస్లిం కాదా? మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలు

GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

AP News Developments Today: నేడు ఇప్పటంకు పవన్ కల్యాణ్, బాధితులకు రూ.లక్ష సాయం

AP News Developments Today: నేడు ఇప్పటంకు పవన్ కల్యాణ్, బాధితులకు రూ.లక్ష సాయం

టాప్ స్టోరీస్

FIFA World Cup 2022: డెన్మార్క్ పై విజయం- నాకౌట్ కు అర్హత సాధించిన ఫ్రాన్స్ 

FIFA World Cup 2022: డెన్మార్క్ పై విజయం- నాకౌట్ కు అర్హత సాధించిన ఫ్రాన్స్ 

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి