IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Case On TDP Leaders: చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే దాడి.. 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య దాడుల ఘటనకు సంబంధించి తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు చేసుకున్న ఘటనకు సంబంధించి తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ కారు డ్రైవర్‌ తాండ్ర రాము ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీకి చెందిన 11 మంది నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అధికార ప్రతినిధి పట్టాభి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర 11 మంది నేతలతో పాటు గుర్తు తెలియని మరో 30 మంది వ్యక్తులు తనను కులం పేరుతో ధూషించారని రాము తన ఫిర్యాదులో తెలిపాడు.  

టీడీపీ నేతల ఫిర్యాదు.. 
చంద్రబాబు ఇంటిపై దాడి అంశానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంట్లోకి చొచ్చుకెళుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. తమపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, తమ్మా శంకర్‌రెడ్డి అనే కార్యకర్త వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి రావడం ఏంటి? అని ప్రశ్నించినందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడి సహా మరో 30-40 మంది తనపై దాడి చేసి గాయపరిచారని.. జంగాల సాంబశివరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు..
చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న తాడేపల్లి పోలీసులు.. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, సమూహాలుగా ఏర్పడటం, గుంపులుగా తరలిరావడం, ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, ప్రజాసేవకుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటుగా.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, జోగి రమేష్‌ వాహనాలు ప్రయాణించిన మార్గాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న పోలీసు గరుడ కంట్రోల్‌ రూమ్‌లో సీసీటీవీ ఫుటేజీలు తీసి ఘర్షణ విజువల్స్‌ను సేకరించినట్లు సమాచారం. డీజీపీ కార్యాలయం వద్ద వివరాలను సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

టీడీపీ నేతలపై మరో కేసు.. 
డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై తాడేపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. డీజీపీ కార్యాలయం గేట్లు నెట్టివేసేందుకు ప్రయత్నించారని తాడేపల్లి ఏఎస్‌ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్‌, జీవీ ఆంజనేయులు, నజీర్‍పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం..
చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, అశోక్ బాబు, ఆలపాటి రాజా తదితరులు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ, కొందరు పోలీసు అధికారుల పాత్రను నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌కు విన్నవించారు. 

Also Read: AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్టు... సాంబశివరావును అరెస్టు చేసిన సీఐడీ... 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

Also Read: ZPTC MPTC Results Live Updates: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు

Published at : 19 Sep 2021 08:46 AM (IST) Tags: YSRCP tdp Jogi Ramesh Four Cases filed over TDP Leaders Chandra Babu Naidu clash at Chandra babu's house Thadepalli Police Station 11 TDP Leaders 4 cases SC ST Cases

సంబంధిత కథనాలు

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల

Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు

Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?