Karnataka Next CM: కర్ణాటక సీఎం పదవిపై వీడని ఉత్కంఠ, పోస్టర్లు ఫ్లెక్సీలతో అభిమానుల యుద్ధం
Karnataka Next CM: కర్ణాటక సీఎం పదవిపై సిద్దరామయ్య, డీకే శివకుమార్ అభిమానులు పోస్టర్ల యుద్ధం మొదలు పెట్టారు.
Karnataka Next CM:
ఇళ్ల బయట పోస్టర్లు
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం పూర్తైపోయింది. ఇప్పుడే అసలైన సవాలు ఎదురైంది ఆ పార్టీకి. డీకే శివకుమార్, సిద్దరామయ్యల్లో ఎవరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలి..? అనే నిర్ణయంపై ఊగిసలాడుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తామని హైకమాండ్ చెబుతున్నప్పటికీ...అది చెప్పినంత సింపుల్ ఏమీ కాదు. ఇద్దరు నేతలూ కాంగ్రెస్ కోసం ఏళ్లుగా పని చేస్తున్నారు. కర్ణాటకలో క్యాడర్‌ని కలిసి నిలబెట్టారు. ముఖ్యంగా డీకే శివకుమార్ ఈ ఎన్నికల్లో విజయం సాధిచడం వెనక కీలక పాత్ర పోషించారు. రాహుల్ తరవాత క్రెడిట్ ఆయనకే అని కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. కానీ...శివకుమార్, సిద్దరామయ్య సపోర్టర్స్ మాత్రం సీఎం ఎవరు అవ్వాలనే అంశంపై ఎవరి వాదన వినిపిస్తున్నారు. "నెక్స్ట్ సీఎం" అంటూ ఎవరికి వాళ్లు ఇద్దరి నేతల ఫోటోలతో పోస్టర్లు తయారు చేసుకున్నారు. చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా కట్టారు. కొందరు సిద్దరామయ్యకు మద్దతునిస్తుండగా..మరికొందరు శివకుమార్‌కి సపోర్ట్ చేస్తున్నారు. బెంగళూరులోని శివకుమార్ ఇంటి బయట ఈ ఫ్లెక్సీలు, పోస్టర్‌లు కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఆయననే సీఎంగా డిక్లేర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు సిద్దరామయ్యకూ అదే స్థాయిలో మద్దతు ఉంది. ఆయన ఇంటి బయటా ఇలాంటి పోస్టర్లే వెలిశాయి. అందుకే హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అయితే...అలాంటిదేమీ లేదని సీఎం పదవి విషయంలో అధిష్ఠానం క్లారిటీగా ఉందని శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఆ ప్రకటన చేస్తుందని చెబుతున్నాయి.
#WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs
— ANI (@ANI) May 14, 2023
#WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy
— ANI (@ANI) May 14, 2023
ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు సీఎంను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ కొత్త ఫార్ములాను రెడీ చేస్తున్నట్లగా భావిస్తున్నారు. ఇద్దరికీ పదవిని పంచాలనే ఓ ఫార్ములాపై వర్కవుట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ సేవలు పార్టీకి చాలా ఉపయోగకరమని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఆయన సేవలను కర్ణాటకలోనే కాకుండా.. దక్షిణాది మొత్తం ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ముందుగా సిద్ధరామయ్యను సీఎం చేసే అవకాశం ఉందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నకిల వరకూ సిద్దరామయ్యను సీఎంగా ఉంచి.. సార్వత్రిక ఎన్నికల తర్వాత శివకమార్ కు సీఎం పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పైగా సిద్దరామయ్య తనకు ఇదే చివరి ఎన్నికలని.. చివరి చాన్స్ అని చెబుతున్నారు. దీనిపై అందరితో చర్చించిన తర్వాత హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.