News
News
వీడియోలు ఆటలు
X

PM Cares : "పీఎం కేర్స్" ప్రభుత్వ నిధి కాదా ? విరాళాలు, ఖర్చులు ఎందుకంత రహస్యం !?

"పీఎం కేర్స్" ఫండ్‌కు వేల కోట్లుగా వచ్చి పడిన విరాళాలు ప్రభుత్వానికి చెందవని కేంద్రం వాదిస్తోంది. విరాళాలు, ఖర్చుల వివరాలు చెప్పడానికి నిరాకరిస్తోంది. ఇంతకీ ఈ ఫండ్ ఎవరిది ? ప్రభుత్వానిది ఎందుకు కాదు?

FOLLOW US: 
Share:


"పీఎం కేర్స్" అంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్. ఈ పీఎం కేర్స్ నిధితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. అసలు పీఎం కేర్స్ ఫండ్ రాజ్యాంగం, కేంద్ర, రాష్ట్ర చట్టాల ప్రకారం ఏర్పాటయినది కాదని కేంద్రం చెబుతోంది. అది ఓ ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ లాంటిదని వాదిస్తోంది. ఆ నిధికి ఇస్తున్న విరాళాలు ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఖాతాలో చేరవని తేల్చేసింది. కానీ అంతా పారదర్శకంగా జరుగుతోందని చెబుతోంది. కానీ సమాచార హక్కు చట్టం కిందకు తెచ్చేందుకు మాత్రం సిద్దంగా లేరు. అసలు పీఎం కేర్స్ ఏంటి ? ఎందుకు పదే పదే వివాదాస్పదం అవుతోంది. 

కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు మోడీ ప్రారభించిన ఫండ్ పీఎం కేర్స్
కరోనా దేశంపై విరుచుకుపడిన సమయంలో  పేదలను ఆదుకోవడానికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వదలిచారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందు కోసం మార్చి 27, 2020న పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రారంభించారు. విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపు కల్పించారు. ఈ నిధికి కేవలం ఐదు రోజుల్లోనే రూ.మూడు వేల కోట్లకుపైగా విరాళాలు వచ్చాయి. కార్పొరేట్లు మాత్రమే కాదు సామాన్యులు కూడా విరాళాలు ఇవ్వవొచ్చు అకౌంట్ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేశారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల నుంచి విరాళాలు ఇచ్చేందుకు పీఎం కేర్స్‌ వెసులుబాటు కల్పించింది.

Also Read : వైట్‌హౌజ్‌లో మోడీ, బైడెన్‌ జోకులు.. 'ఇండియాలో ఐదుగురు బైడెన్లు ఉన్నారు'.. 


ప్రధానమంత్రి చైర్మన్ - ప్రభుత్వంలోని పెద్దలే నిర్వాహకులు !
ప్రధానమంత్రి పీఎం కేర్స్ ఫండ్‌కు చైర్మన్‌గా ఉంటారు. ఈ ట్రస్టును దిల్లీ రెవెన్యూ శాఖ పేరుతో 2020 మార్చి నెలలో రిజిస్టర్‌ చేశారు.  దీనిలో రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థికమంత్రులు ట్రస్టీలుగా ఉన్నారు. అంటే మొత్తంగా ప్రభుత్వ పెద్దలే నిర్వహిస్తారు. ఏ విధంగా చూసినా ఇది ప్రభుత్వ ఫండే అనుకంటారు. తాము విరాళాలుగా ఇచ్చే మొత్తం ప్రభుత్వం ఖాతాలోనే పడుతుందని అనుకుంటారు. కానీ మెల్లగా ఈ అంశంపై స్పష్టత వచ్చింది. అది ప్రభుత్వానికి కాదని ఇప్పుడు కేంద్రమే నేరుగా అఫిడవిట్ దాఖలు చేసింది.

Also Read : 'క్వాడ్' సదస్సులో శాంతి మంత్రం.. వ్యాక్సిన్ సరఫరా, ప్రపంచ భద్రతే లక్ష్యం

ప్రభుత్వానిది కాకపోతే అధికారిక చిహ్నం సహా అన్నీ ఎలా వాడుకుంటారు ?
పీఎం కేర్స్ ఫండ్‌ లోగోలోనే అధికారిక చిహ్నం ఉంటుంది. https://www.pmcares.gov.in/en/  వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరులో .gov, ప్రధానమంత్రి ఫోటో, కేంద్ర ప్రభుత్వ ముద్రను కూడా ఉపయోగిస్తారు. అసలు ప్రభుత్వానికి కానప్పుడు ఇప్పటి వరకూ అవన్నీ ఉపయోగించే ప్రభుత్వానిదే అన్న భావన ఎందుకు కల్పించారు.. ఇది అధికార దుర్వినియోగమే కదా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. వచ్చింది కూడా. అందుకే కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి.

Watch Video : కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు నోట... బాలీవుడ్ పాట... నెటిజన్లు ఫిదా

ప్రభుత్వానికి చెందిన ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధిని ఎందుకు పక్కన పెట్టారు ? 
రాష్ట్రాల్లో సీఎంఆర్ఎఫ్ ఉన్నట్లుగాకేంద్రంలో ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి ఉంది. ఎవరైనా విరాళాలు ఇవ్వదల్చుకుంటే ఆ నిధికే నేరుగా ఇస్తారు. ఆ నిధి కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ అవుతుంది. కానీ పీఎం కేర్స్ అలా కాదు. అందుకే మొదటి నుంచి పీఎం కేర్స్ ఫండ్‌ గురించి విపక్షాలు, మేధావులు విమర్శలు చేస్తున్నారు.  గతంలో పీఎం కేర్స్ ఫండ్ డబ్బును ఎన్టీఆర్ఎఫ్‌ ఖాతాలోకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిని సుప్రీంకోర్టు కొట్టి వేసింది.  పలువురు ఆర్టీఐ కింద సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, విదేశాల నుంచి విరాళాలను సేకరిస్తున్నందున దీని పూర్తిగా ప్రభుత్వ నిధిగా పరిగణించలేమని పేర్కొంది. అందుకే ఆర్టీఐ కిందకు రాదని వెల్లడించింది.

Also Read :  ఐఏఎస్ సాధించిన బస్సు డ్రైవర్ కూతురు.... ఆర్థిక పరిస్థితిని అధిగమించి ఆల్ ఇండియా ర్యాంక్

పీఎం కేర్స్‌లో ప్రతీది రహస్యమే ! 

పీఎం కేర్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. చివరికి  ట్రస్ట్ డీడ్ కూడా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. విరాళాలు ఎవరి వద్ద నుంచి వస్తున్నాయో తెలియదు. ఎలా ఖర్చు పెడుతున్నారో తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కరోనాపై పోరాటం కోసం ఫండ్ నుంచి మూడు వేల కోట్లకుపైగా పీఎం కేర్స్ నుంచి అందించామని ప్రకటించింది. 2,000 కోట్లు వెంటిలేటర్లకు, వెయ్యి కోట్లు వలస కూలీల కోసం, వంద కోట్లు వాక్సిన్ తయారీ కోసం ఇచ్చామని బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ దీనికి అధికారిక సమాచారం కానీ పత్రాలు కానీ లేవు.   నిజానికి న్యాయనిపుణుల్లోనూ ఇలాంటి ట్రస్టులపై అనుమానాలుఉన్నాయి. ప్రభుత్వాలు చట్టాలు చేసిన తర్వాత ఇలాంటి ఫండ్‌లు ఏర్పాటు చేయాలని అంటున్నారు.  ప్రభుత్వం దీనిని ఏ చట్టం లేకుండానే చేసింది. అందుకే పీఎం కేర్స్ ఫండ్ చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు.  ఇప్పుడు ఈ ఫండ్‌ను ఆడిటిం‌గ్ చేయడానికి ఎవరికీ అధికారాలు లేవు.

 

Also Read: సివిల్ సర్వీసెస్ 2020 తుది ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగువారు ఎవరంటే

 
"పీఎం కేర్స్‌"లో పారదర్శకత లేకపోతే ప్రభుత్వంపైనే అనుమానాలు !

పీఎం కేర్స్ నిధిని ప్రభుత్వ సంస్థగానే ఇప్పటి వరకూ ప్రొజెక్ట్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచే పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు. ప్రైవేటు వ్యక్తుల నుంచీ సేకరించారు. వారంతా ఎందుకు ఇచ్చారంటే ప్రధానమంత్రిని చూసే ఇచ్చారు. ఇప్పుడు వారు ఇచ్చిన నిధులు ప్రభుత్వ ఖాతాలోకి రావు..  అంటే ప్రజలు అనుమాన పడతారు. ఎవరు ఇచ్చారు..ఎలా ఇచ్చారు.. ఎక్కడ ఖర్చు పెట్టారన్న పారదర్శకతలేకపోతే ఇంకా ప్రభుత్వంపై అనుమానాలు పెరిగిపోతాయి. దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి మరక పడుతుందే కానీ మంచి జరగదన్న అభిప్రాయం ఉంది. 

Watch Video : క్యాన్సర్‌ మహమ్మారిని జయించిన పలువురు సెలబ్రెటీలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Sep 2021 01:40 PM (IST) Tags: pm cares PM FUND MODI CARES PM CARES VIVADAM PM CARES ROW

సంబంధిత కథనాలు

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

టాప్ స్టోరీస్

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి

క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి