Watch: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు నోట... బాలీవుడ్ పాట... నెటిజన్లు ఫిదా
కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తాజాగా ఓ కార్యక్రమంలో పాట పాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకి ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఫిట్ నెస్ టాస్క్‌లు, యోగాసనాలు... ఇప్పుడు కొత్తగా సింగింగ్. అవును 49 ఏళ్ల రిజుజు తాజాగా ఓ కార్యక్రమంలో పాట పాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను పాడిన పాటకు సంబంధించిన వీడియోను రిజుజు తన ట్విటర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు.
Also Read: PM Modi US Visit: మోదీ- బైడెన్ మధ్య చారిత్రక భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
Just to please the young and smart Arunachal Civil Service Officers after completing their 1st ever Customised Training Programme at the Premier Academy for IAS, Elite Officers - 'Lal Bahadur Shastri National Academy of Administration' @LBSNAA_Official pic.twitter.com/INGQGfFsVs
— Kiren Rijiju (@KirenRijiju) September 23, 2021
ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో ట్రైనింగ్ పొందిన అరుణాచల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న రిజుజు ఎంతో సరదాగా గడిపారు. ఆఫీసర్లతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా 1981లో అమితాబ్ బచ్చన్ నటించిన Yaarana చిత్రంలోని Tere Jaisa Yaar Kahan పాటను పాడారు.
I thank Chief Minister of Arunachal Pradesh @PemaKhanduBJP Ji for arranging the 1st ever Customised Training Programme for Arunachal Civil Service Officers at India's top Academy - 'Lal Bahadur Shastri National Academy of Administration, Mussoorie @LBSNAA_Official https://t.co/QqglM11HwS pic.twitter.com/rxc08ZotXb
— Kiren Rijiju (@KirenRijiju) September 19, 2021
ఈ వీడియోను రిజిజు తన ట్విటర్ ద్వారా పంచుకుంటూ... అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్‌కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆఫీసర్లు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.
Hosted young and smart Arunachal Pradesh Civil Service Officers at my Delhi Residence after completing 1st ever Customised Training Programme at India's Premier Academy for IAS, Elite Officers - 'Lal Bahadur Shastri National Academy of Administration'
— Kiren Rijiju (@KirenRijiju) September 19, 2021
Thank you @LBSNAA_Official pic.twitter.com/i7ch70jQ2T
గతంలో కూడా రిజుజు ఓ సారి పాట పాడారు. 1973 నాటి Dhund చిత్రంలోని పాటను అప్పట్లో పాడారు. అప్పడు కూడా రిజిజు పాడిన పాటకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా రిజుజు పాడిన వీడియోపై నెటిజన్లు స్పందించారు. రిజుజు గొప్పగా పాడారని ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి