(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi US Visit: మోదీ- బైడెన్ మధ్య చారిత్రక భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ కీలక చర్చలు జరుపుతున్నారు. అనంతరం క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశం కోసం శ్వేతసౌధానికి విచ్చేసిన మోదీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్వేతసౌధం బయట ప్రవాస భారతీయులు.. మోదీని సాదరంగా ఆహ్వానించారు. మోదీతో భేటీకి ముందు బైడెన్ ట్వీట్ చేశారు.
Washington, DC | Prime Minister Narendra Modi and US President Joe Biden engage in a bilateral meeting at the Oval Office in the White House. pic.twitter.com/cqbw5mtkxs
— ANI (@ANI) September 24, 2021
Celebrations continue outside White House, Washington DC as people wait to welcome PM Modi. "We feel privileged to welcome him here.He's a promising leader, can take India to greater heights,"a supporter says
— ANI (@ANI) September 24, 2021
The PM will have a bilateral meeting with US President Joe Biden today pic.twitter.com/K9TnkPBijV
ఈ అంశాలపైనే చర్చ..
- వాణిజ్యం, పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగనున్నట్లు సమాచారం.
- తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నారు.
- అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలపై కూడా ఇరుదేశాధినేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది.
క్వాడ్ సదస్సు..
బైడెన్‌తో భేటీ తర్వాత క్వాడ్ సదస్సుకు మోదీ హాజరవుతారు. టీకాల సరఫరా, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణపై రంగంలోనూ ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా క్వాడ్ దేశాధినేతలు చర్చలు జరుపనున్నారు.