IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

వైట్‌హౌజ్‌లో మోడీ, బైడెన్‌ జోకులు.. 'ఇండియాలో ఐదుగురు బైడెన్లు ఉన్నారు'..'ఈ డాక్యుమెంట్లు మీ బంధువులవే'

భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. మోడీ, బైడెన్ జోకులు వేసుకున్నారు. 

FOLLOW US: 

ఇండియాలో ఇంటిపేర్లపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రస్తవన తెచ్చారు. భారత్‌ లో ఐదుగురు బైడెన్లు ఉన్నారంటూ జోక్ చేశారు. వెంటనే దానికి కౌంటర్ గా రిప్లై ఇచ్చారు ప్రధాని మోడీ. తనతోపాటు మీ వంశపారంపర్య చరిత్రను తెలిపే డాక్యుమెంట్స్ తీసుకొచ్చానని చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవారంతా నవ్వారు.

1972లో సెనేటర్ గా గెలిచినప్పుడు ముంబై నుంచి తనకో లెటర్ వచ్చిందని చెప్పారు బైడెన్. అందులో తన ఇంటి పేరు బైడెన్‌ అని లేఖ రాసిన వ్యక్తి చెప్పినట్లుగా తెలిపారు. తర్వాత ఉపాధ్యక్షుడి హోదాలో ముంబై వచ్చినప్పుడు మీడియా ఈ విషయం గురించి ప్రశ్నించిందన్నారు. ఆ తర్వాతి రోజు భారత్‌ లో ఐదుగురు బైడెన్లు ఉన్నారని వార్తలు వచ్చినట్లుగా ఆనాటి విషయాల్ని గుర్తు చేశారు.

బైడెన్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. దీనికి సంబంధించి కొన్ని పత్రాలు తీసుకొచ్చానని తెలిపారు. వారంతా మీ బంధువులేనని చెప్పారు. బైడెన్ ఇంటిపేర్ల గురించి మీరు మాట్లాడార‌ని, గ‌తంలోనూ దీని గురించి చెప్పార‌ని, అయితే వారి డాక్యుమెంట్ల కోసం అన్వేషించాన‌ని, వారికి సంబంధించిన కొన్ని ద‌స్త్రాలు దొరికాయ‌ని, ఆ పేప‌ర్లు మీకేమైనా ఉప‌యోగ‌ప‌డుతాయేమోన‌ని మోదీ అన్నారు. దీంతో జో బైడెన్ న‌వ్వును ఆపుకోలేక‌పోయారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సమావేశంలో బైడెన్​ అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోదీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు. 

ఈ సమావేశం ఎంతో కీలకమైందని మోడీ చెప్పారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. భారత్‌-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం సాంకేతికతను వాడేలా మన ప్రతిభను వినియోగించుకోవాలన్నారు. భారత్‌- అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.

అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం సందర్భంగా అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. టెక్నాలజీ ఇరు దేశాల రూపురేఖలను మార్చివేస్తుందని అన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య బలమైన బంధానికి విత్తనం నాటినట్లు మోదీ వెల్లడించారు. ఇక చర్చల్లో భాగంగా కరోనా వైరస్, వాతావరణ మార్పులు, క్వాడ్ సమావేశంపై లోతుగా చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇరు దేశాల అగ్రనాయకుల భేటీకి ముందు జో బైడెన్ తాను ప్రధాని మోదీతో వైట్‌హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్,కోవిడ్-19, వాతావరణంలో మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చిస్తామని ట్వీట్ చేశారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: QUAD Summit: 'క్వాడ్' సదస్సులో శాంతి మంత్రం.. వ్యాక్సిన్ సరఫరా, ప్రపంచ భద్రతే లక్ష్యం

Published at : 25 Sep 2021 11:29 AM (IST) Tags: Modi Joe Biden modi and biden meet jokes between modi and biden at white house

సంబంధిత కథనాలు

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

US Formula Milk Shortage : అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత - ఎక్కడ చూసినా నో స్టాక్ !

US Formula Milk Shortage :  అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత - ఎక్కడ చూసినా నో స్టాక్ !

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!

Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Afghan Taliban Rules :  టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ