దయచేసి రిజైన్ చేయండి, లేదంటే మేమే బయటకు పంపాల్సి ఉంటుంది - జుకర్ బర్గ్ మెయిల్ వైరల్
Mark Zuckerberg: 2010లో మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు పంపిన ఓ మెయిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Mark Zuckerberg Harsh Mail:
పాత మెయిల్..మళ్లీ వైరల్..
మెటాలో భారీ మొత్తంలో లేఆఫ్‌లు కొనసాగుతున్న క్రమంలో మార్క్ జుకర్ బర్గ్ మెయిల్ ఒకటి వైరల్ అవుతోంది. 2010లో ఫేస్‌బుక్ ఎంప్లాయ్‌లకు "దయచేసి రిజైన్ చేయండి" అంటూ జుకర్ పంపిన మెయిల్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగి ఎంతో కీలకమైన అంతర్గత సమాచారాన్ని వేరే వాళ్లకు పంపాడని ఆరోపించింది ఫేస్‌బుక్. ఈ మేరకు "please resign" సబ్జెక్ట్ లైన్‌తో మెయిల్ పంపాడు. ఇంతకన్నా నమ్మకద్రోహం ఇంకేం ఉండదు అంటూ ఆ ఉద్యోగిపై ఫైర్ అయ్యాడు. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన..ఇప్పుడు Internal Tech Emails ద్వారా వెలుగులోకి వచ్చింది. "Confidential - Do Not Share" అనే లైన్‌తో స్టార్ట్ చేసి ఆ ఉద్యోగికి మెయిల్ పంపాడు జుకర్.
"మేం కొత్త మొబైల్ ఫోన్ తయారు చేస్తున్నామని మీరు చెబుతున్నారు. మాకు అలాంటి ఆలోచనే లేదు. దీనిపై నేను క్లారిటీ ఇచ్చాను. ఎంతో మందికి సమాధానం చెప్పాను. మేం ఏం చేస్తున్నామో వివరించాను. యాప్స్‌ను ప్రజలకు ఇంకా ఎలా దగ్గర చేయాలన్నది మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇంత కీలకమైన సమాచారాన్ని బయటి వాళ్లకు చెప్పడం అంటే నమ్మకద్రోహమే. ఈ సమాచారం ఎవరు లీక్ చేసినా సరే వెంటనే రిజైన్ చేయండి. ఇది తప్పేం కాదని మీరు భావిస్తే వెంటనే వెళ్లిపోండి. ఒకవేళ మీరు రిజైన్ చేయకపోతే మేమే మీరెవరో కనుక్కుని మరీ బయటకు పంపాల్సి ఉంటుంది. "
- జుకర్ బర్గ్, 2010లో రాసిన మెయిల్
లేఆఫ్‌లు..
మెటాలో భారీ సంఖ్యలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఆ మధ్య 10 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించి సంస్థ...ఇటీవలే మరో 10 వేల మందిని ఇంటికి పంపనున్నట్టు ప్రకటించింది. కాస్ట్ కటింగ్‌లో భాగంగా తప్పడం లేదని సీఈవో జుకర్ బర్గ్ చెబుతున్నా ఆ కంపెనీపై అసహనం అయితే పెరుగుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకూ జాబ్ గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇలాంటి కీలక తరుణంలో ఉద్యోగులతో మీటింగ్ పెట్టారు జుకర్‌బర్గ్. మార్చి 16న ఈ సమావేశం జరిగినట్టు The Washington Post వెల్లడించింది. అయితే...ఈ మీటింగ్‌లో ఉద్యోగులందరూ జుకర్‌బర్గ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కంపెనీ పరిస్థితేంటి అని నేరుగానే ఉద్యోగులు జుకర్‌ను ప్రశ్నించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అటు జుకర్ బర్గ్ మాత్రం కంపెనీ రీఆర్గనైజేషన్ గురించి మాట్లాడారట. వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి కూడా అడగ్గా...దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాధానమిచ్చారు జుకర్‌బర్గ్. మెటా ప్లాట్‌ఫామ్ మరోసారి 10 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితం 11 వేల మందిని తొలగించిన కంపెనీ రెండో రౌండ్‌లోనూ అదే స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపాలనుకుంటోంది. ‘మా బృందం పరిమాణం 10 వేల మందిని తగ్గించనున్నాం, 5000 అదనపు ఉద్యోగుల నియామకం కూడా ఉండదు’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
Also Read: సీఎంని బాంబు పెట్టి చంపేస్తా, కాల్ చేసి బెదిరించిన యువకుడు - అరెస్ట్