అన్వేషించండి

Parliament: దేశభద్రతపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు - భగ్గుమన్న బీజేపీ - ఇంతకీ నవరణె బుక్‌లో ఏముంది?

Parliament Budget Session : దేశభద్రతపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని పార్లమెంట్ లో దుమారం రేగింది. కల్పిత కథలను చెబుతూ దేశాన్ని కించ పరుస్తున్నారని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Parliament Budget Session Rahul Controversial Comments:  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో దేశభద్రత అంశంపై తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  దేశ భద్రతపై ఆరోపణలు చేశారు.  భారత సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతోందని, కైలాష్  పర్వాతల వద్ద చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసినట్లుగా చెబుతున్న  ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఆయన ఉటంకిస్తూ, దేశ రక్షణ సన్నద్ధతపై ప్రశ్నలు సంధించడం సభలో తీవ్ర దుమారానికి దారితీసింది.

రాహుల్ వ్యాఖ్యలపై  బీజేపీ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుంటూ.. ఆధారాలు లేని, ఇంకా ప్రచురణకు నోచుకోని పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. దేశ భద్రత వంటి సున్నితమైన అంశంపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కల్పిత వాదనలు చేయడం సైన్యాన్ని అవమానించడమేనని రిజిజు మండిపడ్డారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట, నినాదాలతో సభ అట్టుడికిపోయింది.       

ఈ గందరగోళంపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభా నిబంధనల ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలను లేదా అధికారికంగా ధృవీకరించని పుస్తకాలను సభలో ప్రామాణికంగా చూపకూడదని ఆయన స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు సభా మర్యాదలను పాటించాలి. ఇది అత్యున్నత సభ, ఇక్కడ చేసే వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలి అని హితవు పలికారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించడానికి ప్రయత్నించినప్పటికీ, స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు.  

అయినప్పటికీ సభలో గందరగోళం సద్దుమణగలేదు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అధికార పక్ష సభ్యులు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభను నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభను  వాయిదా వేశారు. దేశభద్రత వంటి కీలక అంశంపై రాజకీయ పోరు సాగడం పట్ల సభా వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget