Nellore News: ఇసుక తరలింపు కోసం రోడ్లు... ప్రజలకు తొలగని పాట్లు.. నెల్లూరు జిల్లాలో రోడ్ల మరమ్మతులకు మోక్షం ఎప్పుడో..?
వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు చేపడతామని హామీలు ఇచ్చి నెలలు గడుస్తున్నా రోడ్ల మరమ్మతులకు మోక్షం కలగలేదు. కానీ నెల్లూరు జిల్లాలో ఇసుక తరలింపు కోసం ఒక్కరోజులో రోడ్డు నిర్మించారు.
ఆఘమేఘాల మీద రోడ్లు వేస్తున్నారు. గ్రావెల్ వేసి, రోడ్ రోలర్లతో చదును చేయించారు. రోజుకి వంద టిప్పర్లు, 200 ట్రాక్టర్లు, జేసీబీలు.. ఆ రోడ్డుపై నుంచి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా స్ట్రాంగ్ గా వేస్తున్నారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి, రోడ్లకు మహర్దశ వచ్చింది, ప్రజల కష్టాలు తొలగిపోయాయి అని మీరనుకుంటే పొరపాటే. ఆ రోడ్లు కేవలం వ్యాపారం కోసం. అవును, ఇసుక వ్యాపారం కోసం సదరు కాంట్రాక్ట్ సంస్థ వేసుకున్న రోడ్లు అవి. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం పల్లిపాడులో కేవలం ఒక్క రోజులోనే గ్రావెల్ రోడ్డు అద్దంలా మెరిసిపోయేలా ఏర్పాటు చేశారు.
Also Read: 23 శాతం ఫిట్మెంట్ ఓకే.... పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం
కాంట్రాక్ట్ సంస్థకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదా..?
ఓవైపు ప్రజలు నిత్యం ప్రయాణాలు చేసే నెల్లూరు నగర రోడ్లు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయి. మరోవైపు కేవలం ఇసుక లారీలు వెళ్లడానికి ప్రైవేటు సంస్థ వేసుకున్న రోడ్లు ఇవి. కనీసం ఓ ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థకు రోడ్లపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకి వందల కొద్దీ లారీలు, ట్రాక్టర్లు వెళ్లేందుకు నేరుగా పెన్నా నదిలోకి రోడ్డు వేశారు. గతంలో ఇక్కడ ఉన్న ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించేందుకు రోడ్డు వేశారు. అయితే పెన్నా వరదలకు ఆ రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పుడు వరదనీరు తగ్గుముఖం పట్టడంతో వెంటనే ఇసుక డంపింగ్ ప్రారంభించేందుకు కాంట్రాక్ట్ సంస్థ ఇలా గ్రావెల్ రోడ్డు వేసేసింది. కేవలం ఒకే ఒక్క రోజులో ఈ రోడ్డు ఏర్పాటు చేశారు.
Also Read: మార్చిలో పదో తరగతి పరీక్షలు... 7 సబ్జెక్టులతో పరీక్షల నిర్వహణ... విద్యాశాఖ మంత్రి సురేశ్ ప్రకటన
నదిలోకి రోడ్డు నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి, వరదలొచ్చాయి.. అని అధికారులు కబుర్లు చెప్పారే కానీ, వర్షాలు తగ్గాక మరమ్మతులు చేయడం మొదలు పెట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. మరోవైపు అవసరాలకోసం కాంట్రాక్ట్ సంస్థలు మాత్రం ఇలా నదీ గర్భంలోకి కొత్త రోడ్లు వేసుకుంటున్నాయి. వాహనాల రాకపోకల కోసం ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి