Mumbai Terror Threat: ముంబయిలో మళ్లీ దాడులు చేస్తాం, NIAకి వార్నింగ్ ఇస్తూ మెయిల్ పంపిన తాలిబన్!
Mumbai Terror Threat: ముంబయిలో మరోసారి ఉగ్రదాడి చేస్తామంటూ NIAకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Mumbai Terror Threat:
బెదిరింపు ఈ మెయిల్..
ముంబయిలో మరో ఉగ్రదాడికి కుట్ర జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. NIAకి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన వెంటనే... ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు మిగతా దర్యాప్తు సంస్థలూ దీనిపై విచారణ చేపడుతున్నాయి. NIA మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తి తనను తాను "తాలిబన్"గా చెప్పుకున్నాడు. సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల మేరకుముంబయిలో మరోసారి ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు బెదిరించాడు. తాలిబన్ ఆర్గనైజేషన్‌లో కీలక వ్యక్తి...సిరాజుద్దీన్. అయితే...ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అని విచారిస్తున్నారు పోలీసులు. ముంబయిలోనే కాకుండా...దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ భద్రత పెంచారు. అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ గ్రూప్ హెడ్ సిరాజుద్దీన్‌ది చాలా పెద్ద నెట్‌వర్క్. తాలిబన్‌లలో నెంబర్ 2 పొజిషన్ ఇతనిదే. హక్కానీ జాడ చెప్పిన వాళ్లకు అమెరికా 10 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడే కాదు. ముంబయికి ఇలాంటి బెదిరింపులు జనవరిలోనూ వచ్చాయి. కంట్రోల్ రూమ్‌కి ఓ వ్యక్తి కాల్ చేసి సిటీలోని చాలా చోట్లు బాంబు దాడులు చేస్తామని హెచ్చరించాడు. మరో రెండు నెలల్లో బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచే భద్రత పెంచిన పోలీసులు...ఇప్పుడు మరింత కట్టుదిట్టం చేశారు.
రామ మందిరంపైనా..?
అయోధ్య రామ మందిరాన్ని పేల్చే కుట్ర జరిగే ప్రమాదముందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో పోలీసులూ అలెర్ట్ అయ్యారు. భారీ భద్రత నడుమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. రామ జన్మభూమి స్థలాన్ని పూర్తిగా పేల్చి వేస్తామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పడం సంచలనమవుతోంది. ఓ స్థానికుడికి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి రామ జన్మభూమి స్థలాన్ని పేల్చేస్తామని హెచ్చరించాడు. ఉదయం ఈ పని పూర్తి చేస్తామని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసినట్టు స్థానికుడు పోలీసులకు వివరించాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్‌లనూ అప్రమత్తం చేశారు.
ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. నాగ్‌పూర్‌లోని గడ్కరీ కార్యాలయానికి ఫోన్ కాల్ చేసి హత్య చేస్తామని బెదింపులకు పాల్పడ్డాడు ఓ గుర్తుతెలియని వ్యక్తి. ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి రెండుసార్లు కాల్ చేసిన ఆ వ్యక్తి.. నితిన్ గడ్కరీని చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపు కాల్స్ రావడంతో గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. సీనియర్ పోలీసు అధికారులు గడ్కరీ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం నాగ్‌పూర్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. నాగ్‌పూర్‌లోని ఖమ్లా రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఆ వ్యక్తి డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించకుంటే కేంద్ర మంత్రి గడ్కరీని హత్య చేస్తామని ఫోన్ కాల్ ద్వారా బెదిరించాడు. దావూద్ పేరు చెప్పిన ఆ నిందితుడు రెండు సార్లు కాల్ చేసి నగదు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన సొమ్ము ఇవ్వకపోతే కేంద్ర మంత్రి గడ్కరీని హత్య చేశామని వార్నింగ్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Amul Milk Prices Hike: అమూల్ పాల ధరల లీటర్‌కు మూడు రూపాయలు పెంపు