Taj Mahal Like Home: మధ్యప్రదేశ్‌లో మరో షాజహాన్.. భార్యకు ప్రేమతో 'తాజ్‌మహల్' కట్టేశాడు!
తన భార్యపైన ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు ఓ వ్యక్తి తాజ్‌మహల్‌ను పోలి ఉన్న ఓ ఇంటిని కట్టించాడు.
తాజ్‌మహల్.. ప్రేమకు ప్రతిరూపం. ముంతాజ్‌పైన తన ప్రేమను చాటి చెప్పడానికి షాజహాన్ కట్టించిన ఈ కట్టడం ఇప్పటికీ ఎంతోమందికి నచ్చిన ప్రదేశం. అయితే తన భార్యపై ప్రేమను చాటిచెప్పడానికి ఓ భర్త కూడా ఇలానే చేశాడు. తాజ్‌మహల్ లాంటి ఓ ఇంటిని నిర్మించాడు. ఈ ఇంటిని నిర్మించేందుకు దాదాపు 3 ఏళ్ల సమయం పట్టింది.
Husband gifted Taj Mahal like home to his wife!
— Siva_Ks (@Sivaji_KS) November 22, 2021
Madhya Pradesh | Burhanpur resident Anand Prakash Chouksey builds a Taj Mahal-like
This house, which has 4 bedrooms, a kitchen, a library and a meditation room and it is said that it takes 3 years to build this house. pic.twitter.com/FAt8KlKRdc
మధ్యప్రదేశ్ వాసి..
మధ్యప్రదేశ్ బుర్హాన్‌పుర్‌కు చెందిన ఆనంద్ చోక్సేకు తాజ్‌మహల్ అంటే చాలా ఇష్టం. షాజహాన్ భార్య ముంతాజ్.. బుర్హాన్‌పుర్ నగరంలో చనిపోయినప్పటికీ అక్కడ తాజ్‌మహల్ ఎందుకు కట్టలేదానని ఆలోచించేవాడు ఆనంద్. నిజానికి తాజ్‌మహల్ తపతి నదీ తీరాన కట్టాలని మొదట నిర్ణయించినప్పటికీ చివరికి ఆగ్రాలో కట్టారు. దీంతో ఎలాగైన తన భార్యకు తాజ్‌మహల్ లాంటి ఇల్లును కట్టివ్వాలని ఆనంద్ అనుకున్నాడు.
ప్రత్యేకతలు..
తాజ్‌మహల్ లాంటి ఇంటిని నిర్మించేందుకు ఆనంద్‌కు మూడేళ్లు పట్టింది. ఇందులో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఈ ఇంటిని నిర్మించే సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఇంజనీర్ తెలిపారు. తాజ్‌మహల్ పలుమార్లు చూసి బంగాల్, ఇండోర్ నగరాలకు చెందిన కళాకారుల సాయంతో ఇంటి లోపల డిజైన్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఇంటి డోమ్ దాదాపు 29 అడుగుల ఎత్తు ఉంది. తాజ్‌మహల్‌లానే టవర్లు నిర్మించారు. ఫ్లోరింగ్ కోసం రాజస్థాన్ మక్రానాను వాడినట్లు ఫర్నీచర్‌ను ముంబయికి చెందిన కళాకారులు తయారు చేసినట్లు ఇంజనీర్ తెలిపారు.
ఇంటిలో మొత్తం ఓ పెద్ద హాల్, గ్రౌండ్ ఫ్లోర్‌లో 2, అప్‌స్టైర్‌లో 2 బెడ్ రూమ్‌లు, ఓ లైబ్రెరీ, మెడిటేషన్ రూమ్ ఉన్నాయి. అంతేకాక ఇంటి లోపల బయట లైటింగ్ వచ్చే రీతిలో ఇంటిని నిర్మించారు. తాజ్‌మహల్‌లానే ఈ ఇల్లు కూడా రాత్రి సమయంలో మెరిసిపోతుంది.
Also Read: Tamil Nadu Crime: భర్తను బతికుండగానే పాతేసిన భార్య.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్ అవుతారు!
Also Read: Farmers Protest: నవంబర్ 29న రైతుల 'చలో పార్లమెంట్'.. మోదీ సర్కార్‌కు తప్పని నిరసన సెగ
Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 249 మంది మృతి
Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు