Rahul Gandhi Vs Mohan Bhagwat: మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై రాహుల్ ధ్వజం - దేశద్రోహం.. రాజ్యాంగాన్ని అవమానించారని విమర్శలు
Constitution Debate: రాజ్యాంగంపై మోహన్ భగవత్ చేసిన ప్రకటన దేశద్రోహమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. భగవత్ ప్రకటన భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు.
Constitution Debate: భారత రాజ్యాంగంపై ఆర్ఆర్ఆర్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ రోజు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ కామెంట్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోహన్ భగవత్ ఇచ్చిన ప్రకటన రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని, రాజ్యాంగం మన స్వేచ్ఛకు చిహ్నం కాదని, ఇది ఖచ్చితంగా తప్పు అని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగాన్నే కాదు మన విలువలను కూడా ఉల్లంఘిస్తుంచేలా ఉన్నాయని చెప్పారు. పాశ్చాత్య దేశాలు బయటి ప్రపంచంపై దృష్టి సారిస్తుండగా, తమను తాము అర్థం చేసుకోవడంపై దృష్టి సారించే పాశ్చాత్య భావజాలానికి భారతదేశ విధానంతో పూర్తిగా భిన్నంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
ఇది దేశద్రోహం.. రాజ్యాంగాన్ని అవమానించడమే
ఢిల్లీ కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. మోహన్ భగవత్ ప్రకటన దేశద్రోహమని అభివర్ణించారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని, అందులో ఒకటి మన రాజ్యాంగ సిద్దాంతంపై, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలమని చెప్పారు. ఇకనైనా ఈ తరహా పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలని అన్నారు. “కొందరు ఏమీ ఆలోచించకుండా బహిరంగంగా మాట్లాడే ఇలాంటి పిచ్చి మాటలు ఆపాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పారు.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "Do not think that we are fighting a fair fight. There is no fairness in this. If you believe that we are fighting a political organisation called the BJP or RSS, you have not understood what is going on. The BJP and… pic.twitter.com/wuZRnxDysB
— ANI (@ANI) January 15, 2025
ఆ విషయంలో కాంగ్రెస్ ది ఎప్పుడూ ఒకే వైఖరి
కాంగ్రెస్ ముందు నుంచీ తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగం, దాని విలువల కోసం నిలబడుతుందన్నారు. రాజ్యాంగానికి సంబంధించి తమ పార్టీ విజన్ స్పష్టంగా ఉందని, విలువలను పాటిస్తూ దేశానికి సేవచేస్తున్నామని చెప్పారు. తాము విశ్వసిస్తున్న భావజాలం, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగ మార్గాన్ని అనుసరిస్తుందని, ఆ దిశగానే ఈ పార్టీ తన పనిని ముందుకు సాగిస్తుందని రాహుల్ అన్నారు.
భగవత్ ప్రకటన అవమానకరం
మోహన్ భగవత్ ప్రకటన భారత స్వాతంత్ర్య పోరాటానికి కూడా వ్యతిరేకంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా భగవత్ దేశ చరిత్రను, వారసత్వాన్ని అవమానించారన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం లేదని మోహన్ భగవత్ దేశ ప్రజలందరినీ అవమానపరిచారని విమర్శించారు. తన వ్యాఖ్యల ద్వారా బ్రిటీష్ వారిపై పోరాడిన యోధులందరినీ కించపరిచారని, ఆయన వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకే వస్తాయని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తిన గాంధీ, అటువంటి భావజాలాన్ని తిరస్కరించడమే కాకుండా దానికి వ్యతిరేకంగా నిలబడాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read : KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం