అన్వేషించండి

MLA Salary: పాపం, ఆ ఎమ్మెల్యేలకు అంత తక్కువ జీతాలా? తెలంగాణలో మాత్రం హైయెస్ట్ సాలరీలు!

ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ దిల్లీ అసెంబ్లీ బిల్స్ పాస్ చేసింది. 2011 నుంచి జీతాలు పెంచలేదని ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఎమ్మెల్యేల జీతాలు పెంచాలి: దిల్లీ అసెంబ్లీ

ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ దిల్లీ అసెంబ్లీ బిల్స్‌ పాస్ చేసింది. 2011 నుంచి ఎమ్మెల్యేల జీతాలు పెంచలేదు. అందుకే ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల జీతాలూ పెంచనున్నారు. అన్ని అలవెన్స్‌లు కలుపుకుని ఒక్కో ఎమ్మెల్యేకి నెలకు రూ.90,000 జీతం ఇవ్వాలన్న ప్రతిపాదనలున్నాయి. 2011లో ఇది రూ.54,000 కాగా ఇప్పుడు దాదాపు 66% మేర పెంచాలని చూస్తున్నారు. బేస్‌ సాలరీ రూ.12,000 నుంచి రూ.30,000 వరకూ పెరగనుంది. కాన్‌స్టిట్యుయెన్సీ అలవెన్స్‌లు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెరగనుంది. టెలిఫోన్ బిల్ ఛార్జ్‌లు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు పెంచనున్నారు. ఇక సెక్రటేరియట్ అలవెన్స్‌లనూ పెంచాలని చూస్తున్నారు. రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకూ పెంచుతారని తెలుస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్యేలకే ఎక్కువ జీతాలు..!

నిజానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే దిల్లీలోని ఎమ్మెల్యేల జీతాలే తక్కువ. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ ప్రకారం..తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే జీతం రూ.20,000. కానీ కాన్‌స్టిట్యుయెన్సీ అలవెన్స్‌ మాత్రం రూ.2.3లక్షలు. అంటే మొత్తం కలుపుకుని రూ.2.5లక్షలు అన్నమాట. దేశంలోని మిగతా ఎమ్మెల్యేలతో పోల్చి చూస్తే...తెలంగాణ ఎమ్మెల్యేలు...అత్యధిక జీతాలు అందుకుంటున్నారు. కర్ణాటక ఆ తరవాతి స్థానంలో ఉన్నట్టు సమాచారం. కర్ణాటకలో ఒక్కో ఎమ్మెల్యే నెలవారీ జీతం రూ. 2.05లక్షలు. తరవాత ఉత్తరప్రదేశ్‌లో రూ. 1.87 లక్షలు, బిహార్‌లో రూ.1.65లక్షలు, జమ్ము కశ్మీర్‌లో రూ.1.60లక్షలు, మహారాష్ట్రలో రూ.1.60లక్షలుగా ఉన్నాయి ఎమ్మెల్యేల జీతాలు. ఎమ్మెల్యేలకు ఆయా రాష్ట్రాలు అందించే జీతాలకు, అలవెన్స్‌లకు చాలా తేడా ఉంటోందని చెబుతోంది పీఆర్‌ఎస్ లిజిస్లేటివ్ సంస్థ. 

ఈసారైనా కేంద్రం ఆమోదిస్తుందా..?

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎమ్మెల్యేల నెల జీతం రూ.55,000కాగా, అలవెన్స్‌లు మాత్రం రూ.1.3లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో జీతం రూ.12,000కాగా కాన్‌స్టిట్యుయెన్సీ అలవెన్స్‌లు రూ. 1.13లక్షలుగా ఉంది. దేశంలో అత్యంత తక్కువ బేస్ సాలరీ తీసుకుంటున్నారు కేరళ ఎమ్మెల్యేలు. వీళ్ల బేస్‌ సాలరీ రూ.2000 మాత్రమే. సెక్రటేరియల్ అలెవెన్స్‌లూ ఉండవు. మిగతా అలవెన్స్‌లు కలుపుకుని రూ.43,750 అందిస్తారు. తరవాత త్రిపుర, రాజస్థాన్, సిక్కిం, మిజోరంలోనూ ఎమ్మెల్యేల నెల జీతాలు తక్కువగానే ఉన్నాయి. నిజానికి దిల్లీ ప్రభుత్వం 2015లోనే ఎమ్మెల్యేల జీతాలు పెంచాలని ప్రతిపాదించింది. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలపలేదు. ఈసారైనా అప్రూవ్ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. దాదాపు పదేళ్లుగా జీతాల్లో పెంపు లేదన్న వాదన వినిపిస్తోంది దిల్లీ సర్కార్. ఈసారి ఎలాగైనా ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. అనుకున్నట్టుగానే ఈ పెంపు అమల్లోకి వస్తే ఆ మేరకు దిల్లీ అసెంబ్లీలోనిఎమ్మెల్యేలందరూ లబ్ధి పొందినట్టే. 

Also Read: Hyderabad As Bhagyanagar: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup 2026 Prize Money: ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
Spain FIFA World Cup Glory: స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా నిలిచిన స్పానిష్ టీమ్.. ఈ కార‌ణాల‌తోనే ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మి..!
స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా.. ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మికి కారణాలివే !
IND VS ENG 3rd Result Update: వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ, 
వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ
Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget