News
News
వీడియోలు ఆటలు
X

Manish Sisodia's Letter: మోదీకి సైన్స్‌పై అవగాహన లేదు,చదువుకోని ప్రధాని దేశానికే ప్రమాదకరం - సిసోడియా లేఖ

Manish Sisodia's Letter: ప్రధాని విద్యార్హతలపై జైల్లో నుంచే సిసోడియా లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

Manish Sisodia's Letter:

జైల్లో నుంచే లేఖ రాసిన సిసోడియా..

ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రస్తుతం లిక్కర్ స్కామ్‌ కేసులో తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కస్టడీని పొడిగిస్తూ వస్తోంది ఢిల్లీ కోర్టు. బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా దాన్ని తిరస్కరించింది. జైల్లో ఉన్నా...బీజేపీపై విమర్శలు ఆపడం లేదు సిసోడియా. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ విద్యార్హతలపై చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసిన తరవాత ప్రతిపక్షాలన్నీ కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిసోడియా జైల్లో నుంచే ఈ వివాదంపై స్పందించారు. దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశారు. ప్రధాని స్థాయిలో ఉన్న మోదీ విద్యార్హతలు సరిగ్గా లేకపోతే అది దేశానికి ఎంతో ప్రమాదం అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ లెటర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

"ప్రధాని స్థాయి వ్యక్తి సరిగ్గా చదువుకోకపోతే అది దేశానికే ప్రమాదం. మోదీకి సైన్స్‌పై అవగాహన లేదు. విద్యకున్న ప్రాధాన్యత ఏంటో ఆయనకు తెలియదు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా 60 వేల స్కూళ్లు మూసేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే... బాగా చదువుకున్న వ్యక్తి ప్రధాని పదవిలో ఉండటం అత్యవసరం" 

- మనీశ్ సిసోడియా 

గతంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి అసహనం వ్యక్తం చేశారు. 

"ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కొన్ని దేశ ప్రజల్ని షాకింగ్‌కు గురి చేశాయి. టీ తయారు చేసే విధానం గురించి పిల్లలకు చెబుతూ వింత వ్యాఖ్యలు చేశారు. మేఘాల వెనక్క దాక్కుని ఉంటే రేడార్ ద్వారా విమానాన్ని గుర్తించొచ్చని మరోసారి అన్నారు. కెనడాలో ఓ మ్యాథ్స్ ఫార్ములాను సరైన విధంగా చెప్పలేకపోయారు. భారత ప్రజలు ఇది విని చాలా అసహనానికి లోనయ్యారు. అంతే కాదు. వాతావరణ మార్పుల గురించీ సరిగ్గా మాట్లాడలేకపోయారు. అలాంటప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించగలరు..? ఆయన చేసిన వ్యాఖ్యలకు పిల్లలందరూ నవ్వుకున్నారు"

- అరవింద్ కేజ్రీవాల్ 

Published at : 07 Apr 2023 11:16 AM (IST) Tags: Arvind Kejriwal Manish Sisodia PM Modi Qualification Manish Sisodia's Letter

సంబంధిత కథనాలు

Odisha Train Accident: రైల్వే ప్రమాదాలకు సీబీఐకి సంబంధం ఏంటి? సేఫ్‌టీ గురించి వాళ్లకేం తెలుస్తుంది - ప్రధానికి ఖర్గే లేఖ

Odisha Train Accident: రైల్వే ప్రమాదాలకు సీబీఐకి సంబంధం ఏంటి? సేఫ్‌టీ గురించి వాళ్లకేం తెలుస్తుంది - ప్రధానికి ఖర్గే లేఖ

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు- షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు-  షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్

Coromandel Train Accident: వెనక నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయ్, కాసేపు స్పృహలోనే ఉన్నాను - కోరమాండల్ డ్రైవర్

Coromandel Train Accident: వెనక నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయ్, కాసేపు స్పృహలోనే ఉన్నాను - కోరమాండల్ డ్రైవర్

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

టాప్ స్టోరీస్

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!