అన్వేషించండి
World Richest Billionaires 2025 : ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ నెంబర్ 1.. టెక్ బిలియనీర్ల రాజ్యమే నడుస్తోందిగా
Worlds Richest People : ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు దాదాపు అందరు బిలియనర్స్ టెక్కి చెందిన వాళ్లే. మరి వాళ్లు ఎవరు? వాటి నెట్ వర్త్ ఎంతో చూసేద్దాం.
ప్రపంచంలోనే అత్యంత ధనికులు వీళ్లే
1/6

472 బిలియన్ డాలర్ల అంచనా ఆస్తితో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు గానిలిచారు. టెక్ పరిశ్రమకు చెందిన ఎలోన్ మస్క్ వెంచర్లు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ కార్ప్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, సోషల్ మీడియా వరకు విస్తరించి ఉన్నాయి.
2/6

మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 264 బిలియన్ డాలర్ల అంచనా ఆస్తితో ఈ జాబితాలో ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా అతను ప్రపంచ సామాజిక కమ్యూనికేషన్, ప్రకటనల వంటి కొన్ని ప్రధాన మార్గాలు అతని కంట్రోల్లో ఉన్నాయి.
3/6

ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎడిసన్ నికర ఆస్తి దాదాపు 262 బిలియన్ డాలర్లు. అతని సంస్థ డేటాబేస్ సాఫ్ట్వేర్, క్లౌడ్ సొల్యూషన్స్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ సంస్థ అతన్ని ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా చేసింది.
4/6

252 బిలియన్ డాలర్ల ఆస్తితో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆన్లైన్ షాపింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో విప్లవం తెచ్చారు. సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత కూడా బ్లూ ఆరిజిన్, ఇతర వెంచర్లలో ఆయన చేసిన పెట్టుబడులు ఆయనను టెక్ బిలియనీర్ల క్లబ్లో బలంగా నిలబెట్టాయి.
5/6

ఈ టాప్ 10 జాబితాలో ఏకైక సాంకేతికేతర బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఉన్నాడు. ఇతను తన ఫ్యాషన్, లగ్జరీ బ్రాండ్ సామ్రాజ్యం ఎల్విఎంహెచ్ ద్వారా దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల ఆస్తిని కలిగి ఉన్నాడు.
6/6

దీనితో పాటు గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ 146 బిలియన్ డాలర్లు.. 140 బిలియన్ డాలర్ల మొత్తం ఆస్తులకు యజమానులు. అలాగే మాజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్, ఎన్విడియా AI మేధావి జెన్సన్ హువాంగ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Published at : 04 Nov 2025 01:23 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















