By: ABP Desam | Updated at : 07 Apr 2023 09:26 AM (IST)
Edited By: Arunmali
వడ్డీ రేట్లు పెంచకపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి స్పందన
Nirmala Sitaraman welcomes RBI Decision: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (RBI MPC), ఈ ఆర్థిక సంవత్సరం (FY 2023-24) మొదటి పాలసీ సమావేశంలోనే దేశ ప్రజలను, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దేశంలో అకాల వర్షాలతో ఏర్పడిన పంట నష్టాల వల్ల సమీప భవిష్యత్తులో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు, ఈ ఏడాది మే నెల నుంచి ముడి చమురు ఉత్పత్తిలో భారీ స్థాయి కోత విధించడానికి ఒపెక్ నిర్ణయించిన నేపథ్యంలో ఈసారి కూడా వడ్డీ రేట్ల పెంపు తప్పదని మార్కెట్ వర్గాలు గట్టిగా నమ్మాయి. అయితే, మార్కెట్ పండితుల అంచనాలను తలకిందులు చేసింది ఆర్‌బీఐ ఎంపీసీ. వడ్డీ రేట్ల పెంపు చక్రంలో 'పాజ్' బటన్ నొక్కి ఆశ్చర్యపరిచింది.
ఆర్థిక మంత్రి స్పందన ఇది
పాలసీ రేట్లను మార్చకుండా, గత రేట్లనే యథతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitaraman) స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి స్వాగతించారు. ఆర్‌బీఐ సరైన నిర్ణయం తీసుకుందని తాను భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
గత ఆర్థిక సంవత్సరంలో 2.50 శాతం పెంపు
అయితే, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, గత ఆర్థిక సంవత్సరంలో (FY 2022-23) వరుసగా ఆరు సమావేశాల్లోనూ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచింది. 4 శాతంగా ఉన్న రెపో రేటును, ఈ ఆరు దఫాల్లో కలిపి 2.50 శాతం పెంచి 6.50 శాతానికి చేర్చింది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశామన్న ఆర్థిక మంత్రి
కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతం కంటే తక్కువగా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని ఆర్థిక మంత్రి అన్నారు. ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరిస్తోందని, అదే సమయంలో దానిని అదుపులో ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయలేదని కూడా నిర్మల సీతారామన్ అన్నారు.
కొవిడ్ వైరస్, యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో కమొడిటీల ధరలు భారీగా పెరిగాయని, అయినా వాటిని భారత్ వాటిని చేసుకుంటూనే ఉందని నిర్మల సీతారామన్ అన్నారు. సామాన్యులకు ఊరట ఇచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని చెప్పారు.
దిగుమతి చేసుకునే ముడి చమురు, వంటగ్యాస్‌పై సబ్సిడీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
ఇది కూడా చదవండి: ఇవాళ స్టాక్ మార్కెట్, బ్యాంకులకు సెలవు - ఈ నెలలోనే మరో హాలిడే
ఇది కూడా చదవండి: శాంతించిన పసిడి, వెండి ధరలు - నిన్నటి షాక్ నుంచి ఉపశమనం
FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్, డాలర్ల వరద పారించిన ఫారినర్లు
Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్ - మీ అకౌంట్ పరిస్థితేంటో చెక్ చేసుకోండి
Latest Gold-Silver Price Today 04 June 2023: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Petrol-Diesel Price 04 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
Debit Card: ఏటీఎం కార్డ్‌తో ₹5 లక్షల 'ఫ్రీ' ఇన్సూరెన్స్, ఇది అందరికీ చెప్పండి
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి