SC on Farmers Protest: 'రైతులారా ఇక ఆపండి.. నగరానికి ఊపిరాడనివ్వండి'
రైతుల నిరసనలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులను దిగ్బంధించడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న పోరాటంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేపట్టేందుకు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించింది కిసాన్ మహాపంచాయత్. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రహదారులు, రైల్వేట్రాక్‌లపై రైతులు నిరసనలు చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. జస్టిస్ ఏఎమ్ ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం రైతు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
జాతీయ రహదారులను దిగ్బంధించింది రైతులు కాదని వారి తరఫున వాదిస్తోన్న న్యాయవాది అజయ్ చౌదరీ కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అటార్నీ జనరల్‌కు కూడా ఓ కాపీ ఇవ్వాలని కోర్టు పేర్కొంది. సోమవారం ఈ ప్రమాణపత్రం రైతులు దాఖలు చేసే అవకాశం ఉంది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
హరియాణాలో నిరసనలు..
మరోవైపు హరియాణాలో రైతులు చేస్తోన్న నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కార్యక్రమం వద్ద ఆందోళన చేస్తోన్న అన్నదాతలపై జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు. వర్షాలకు తమ పంటలు మునిగిపోతే కనీసం పరామర్శకు కూడా డిప్యూటీ సీఎం రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
#WATCH | Police use water cannon to disperse protesters who trespassed barricades ahead of Haryana Deputy CM Dushyant Chautala's programme, in Jhajjar. "At a time when farmers' crops have been damaged due to rains, Dy CM is coming here, instead of meeting them,"a protester says pic.twitter.com/NDHIuh0RRQ
— ANI (@ANI) October 1, 2021
ALSO READ: పోలీసు స్టేషన్‌లో నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సీన్.. పోలీసు అధికారికి ట్రాన్స్‌జెంజర్స్ సన్మానం