అన్వేషించండి

Kerala Lockdown: కేరళలో కరోనా కల్లోలం.. మరోసారి వీకెండ్ లాక్‌డౌన్, రాష్ట్రానికి ఆరుగురు సభ్యుల స్పెషల్ టీమ్

తక్కువ సమయంలోనే కోవిడ్19 వ్యాప్తిని అరికట్టి శభాష్ అనిపించుకున్న రాష్ట్రం కేరళలో పరిస్థితి అదుపు తప్పుతోంది. దేశంలోని కేసులలో 40 శాతానికి పైగా పాజిటివ్ కేసులు కేరళలో నమోదవుతున్నాయి.

నెలన్నర రోజుల కిందటే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజులో లక్షల్లో నమోదైన కోవిడ్19 కేసులు దాదాపు 40 వేలకు దిగొచ్చాయి. మరోవైపు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే దాదాపుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలను సడలించాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే మరోవైపు కేరళ రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో మరోసారి వీకెండ్ లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా జులై 31, ఆగస్టు 1 తేదీలలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులలో దాదాపు 40 శాతం మేర కేసులు కేరళ నుంచి రావడం గమనార్హం. ఈ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదుకావడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆరుగురు సభ్యుల టీమ్‌ను కేరళకు పంపాలని నిర్ణయం తీసుకుంది. 

కేరళలో కరోనా వ్యాప్తి అధికం కావడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందించారు. గత కొన్ని రోజుల నుంచి దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో అధికంగా కేరళలోనే నిర్ధారణ అవుతున్నాయని చెప్పారు. కరోనా కట్టడి చర్యలలో కేరళ ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామన్నారు. ఆరుగురు సభ్యుల టీమ్ ఆ రాష్ట్రానికి వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తుందన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తక్కువ సమయంలోనే కోవిడ్19 వ్యాప్తిని అరికట్టి శభాష్ అనిపించుకున్న రాష్ట్రం కేరళలో పరిస్థితి అదుపు తప్పుతోంది.  

గత రెండు వారాల కిందట దేశంలో నమోదవుతున్న కేసులలో 30 శాతంగా ఉన్న కేరళ కరోనా కేసులు ప్రస్తుతం 40 శాతానికి చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి వారం వీకెండ్ లాక్‌డౌన్ మాత్రమే విధిస్తూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కరోనా వ్యాక్సినేషన్ వేగంగా చేస్తున్నా, పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులతో కొత్త వేవ్ సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కేరళలో త్వరగా కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

కేరళలో బుధవారం నాడు 22,056 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. మరో 131 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ 33,27,301 మంది కరోనా బారిన పడగా, మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 16, 457కు చేరుకుంది. ఐసీఎంఆర్ ప్రకారం జూన్ 14 నుంచి జులై 6 తేదీల మధ్య ఈ రాష్ట్రంలో కోవిడ్ యాంటీబాడీలు 44.4 శాతం మందిలో ఉన్నాయని గుర్తించారు. కానీ కరోనా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget