(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka Protests: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి, రిజర్వేషన్‌లలో మార్పులపై ఆ వర్గం ఆగ్రహం
Karnataka Protests: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.
Karnataka Protests:
బంజారా వర్గ ప్రజల డిమాండ్..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బంజారా వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు శివమొగ్గలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. యడియూరప్ప, సీఎం బసవరాజు బొమ్మై దిష్టి బొమ్మలు దహనం చేశారు. షెడ్యూల్ తెగల రిజర్వేషన్ కోటాలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఈ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఒక్కసారిగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ అల్లర్లలో ఓ పోలీస్ గాయపడ్డారు. రిజర్వేషన్ కోటాలో మార్పులు అవసరం అంటూ కేంద్రానికి నివేదించింది కర్ణాటక ప్రభుత్వం. షెడ్యూల్ తెగలకు చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ల కోటా తగ్గించాలని ప్రతిపాదించింది. ఎస్‌సీ కమ్యూనిటీకి ప్రస్తుతం అందిస్తున్న 17% రిజర్వేషన్‌లలో లెఫ్ట్ షెడ్యూల్ కులాలకు 6%, రైట్ షెడ్యూల్ కులాలకు 5.5% రిజర్వేషన్‌లు కేటాయించింది. AJ సదాశివ కమిషన్ అందించిన రిపోర్ట్ ఆధారంగా కోటాలో మార్పులు చేర్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే...దీనిపై బంజారా వర్గ ప్రజలు మండి పడుతున్నారు. ఈ మార్పులు చేయడం వల్ల తమకు వచ్చే రిజర్వేషన్‌ల వాటా తగ్గిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Shivamogga, Karnataka | Stones were pelted at former CM BS Yediyurappa's office and house during a protest staged by Banjara and Bhovi communities.
— ANI (@ANI) March 27, 2023
They were protesting against the implementation of the former Justice Sadashiva Commission's report.
ప్రభుత్వ ప్రతిపాదనలపై కాంగ్రెస్ మండి పడుతోంది. రాజ్యాంగం అన్ని వర్గాలకూ సమాన హక్కులు కల్పించిందని, వాటిని లాగేసుకుంటారా అంటూ ప్రశ్నిస్తోంది. బీజేపీ దేశాన్ని విడగొట్టాలని చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే...ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేస్తామని హామీ ఇచ్చింది.
Congress party condemns this decision. As soon as Congress party forms govt in May we will scrap this on first day. Even Home Minister has supported this decision. People of Karnataka know this govt will not deliver what they had spoken: Karnataka Congress Chief DK Shivakumar
— ANI (@ANI) March 27, 2023
గతేడాది బెలగావిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2సీ, 2డీ అనే రెండు కొత్త రిజర్వేషన్ కేటగిరీలను సృష్టించి ముస్లింలకు ఉన్న 4 శాతాన్ని వొక్కలిగ (2శాతం), లింగాయత్ (2 శాతం) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు) రిజర్వేషన్ 15 నుంచి 17 శాతం, ఎస్టీల రిజర్వేషన్ 3 నుంచి 7 శాతానికి పెంచారు. "కోటా కేటగిరీలలో మార్పులను క్యాబినెట్ సబ్కమిటీ సిఫార్సు చేసింది మరియు మేము దానిని అమలు చేసాము" అని బొమ్మై తెలిపారు.
Also Read: Karnataka Elections 2023: ఎలక్షన్ ఫైట్కు సిద్ధమైన కాంగ్రెస్, అభ్యర్థుల పేర్లు ఖరారు