Karnataka Elections 2023: ఎలక్షన్ ఫైట్‌కు సిద్ధమైన కాంగ్రెస్, అభ్యర్థుల పేర్లు ఖరారు
Karnataka Elections 2023: కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.
Karnataka Elections 2023:
కర్ణాటక ఎన్నికలు..
మరో రెండు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ యాక్టివ్ అయ్యాయి. ఎలక్షన్స్‌కు రెడీ అయిపోతున్నాయి. బీజేపీ కన్నా ఓ అడుగు ముందే ఉంది కాంగ్రెస్. అప్పుడే అభ్యర్థుల జాబితానూ విడుదల చేసింది. 124 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ ప్రకటించకపోయినప్పటికీ కాంగ్రెస్ ముందస్తుగా సిద్ధమవుతోంది. ఈ ఏడాది మే 24తో అసెంబ్లీ గడువు ముగిసిపోనుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరు కూడా ఉంది. ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌కి కూడా అవకాశమిచ్చింది అధిష్ఠానం. కనకపుర నియోజకవర్గం నుంచి శివకుమార్ పోటీ చేయనున్నారు. వరుణ నియోజకవర్గం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఆ సీటు కేటాయించింది కాంగ్రెస్. అయితే...సిద్దరామయ్యను మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బదామి, వరుణ, కోలార్ నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట పోటీ చేయాలనుకుంటున్నట్టు గతంలోనే సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే కోలార్ జిల్లా నుంచి కూడా ఆయనను ఎన్నికల బరిలోకి దింపనున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే రెండు చోట్ల పోటీ చేశారు. ఈ లిస్ట్‌లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశమిచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
Congress party announces the first list of 124 candidates for Karnataka Assembly Elections.
— ANI (@ANI) March 25, 2023
Names of former CM Siddaramaiah, and State party president DK Shivakumar are present in the first list. pic.twitter.com/TC9vXJfrX5
కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. అధికార బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆ వర్గానికి ఉన్న 4శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసిన బొమ్మై ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో ముస్లింలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విభాగంలో 10శాతం రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. మరోవైపు.. ముస్లింలకు రద్దు చేసిన 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు కేటాయించనున్నారు.