Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,బీజేపీకి గట్టి కౌంటర్
Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు గోమూత్రం చల్లి శుద్ధి చేశారు.
Karnataka Assembly:
ప్రాంగణంలో గోమూత్రం..
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీ సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది మంత్రులూ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే అసెంబ్లీలో అడుగు పెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకపై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ..అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. అయితే...కాంగ్రెస్‌కి మాత్రం ఈ విజయం మంచి బూస్ట్ ఇచ్చింది. సిద్దరామయ్య ఇప్పటికే గత ప్రభుత్వంపై కౌంటర్‌లు వేయడం మొదలు పెట్టారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు. మతం కార్డు అన్ని చోట్లా పని చేయదు అంటూ విమర్శిస్తున్నారు. అయితే...ఇప్పుడు కర్ణాటక విధాన సభ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కార్యకర్తలు విధాన సౌధ వద్దకు వచ్చారు. ఓ బిందె తీసుకొచ్చారు. అందులో గోమూత్రం నింపారు. విధాన సౌధ ప్రాంగణం అంతా చల్లారు. ఆ తరవాత పూజ కూడా చేశారు. ఇదంతా బీజేపీకి కౌంటరే. ఎందుకిలా చేశారని అడిగితే "అసెంబ్లీని శుద్ధి చేస్తున్నాం అంతే" అని సమాధానమిచ్చారు. అవినీతిమయమైన గత బీజేపీ ప్రభుత్వంతో విధాన సౌధ అపవిత్రమైపోయిందని, గోమూత్రం చల్లి శుద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Bengaluru: Congress workers sprinkle cow urine and perform Pooja at the State Assembly in Bengaluru. They said that they are 'purifying' Vidhana Soudha. pic.twitter.com/SWapoH7vOL
— ANI (@ANI) May 22, 2023
క్యాస్ట్ ఈక్వేషన్స్ సంగతేంటి..?
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఇక్కడితోనే కథ అయిపోలేదు. అసలు సవాళ్లన్నీ ఇప్పటి నుంచే మొదలవుతాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు..అంతర్గత విభేదాలు లేకుండా చూసుకోవడం హైకమాండ్‌కి పెద్ద టాస్క్. రాజస్థాన్‌లో ఇప్పటికే గహ్లోట్, పైలట్ మధ్య ఏ స్థాయిలో వార్ జరుగుతోందో దేశమంతా గమనిస్తూనే ఉంది. "కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఇంతే. ఇంటి పోరుతోనే అలా అయిపోయింది" అనే విమర్శల్నీ ఎదుర్కొంటోంది ఆ పార్టీ. ఇలాంటి సమయంలో బూస్ట్ ఇచ్చిన కర్ణాటక విక్టరీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఉత్సాహంతో ముందుకు సాగుతూనే...తప్పటడుగులు వేయకుండా చూసుకోవాలి. ప్రస్తుతం కర్ణాటక విషయంలో కేబినెట్ విస్తరణ చాలా కీలకంగా మారింది. ఆశావహులందరూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. "ఒక్క ఛాన్స్" అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. కానీ...క్యాస్ట్ ఈక్వేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కేబినెట్ని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ మాత్రం క్లారిటీ మిస్ అయినా...కథంతా మళ్లీ మొదటికే వస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వం కూలితే మాత్రం..ఇక కాంగ్రెస్‌పై ప్రజలు ఉన్న నమ్మకం కూడా పోగొట్టుకునే ప్రమాదముంది.
Also Read: Kharge Calls Meet: కీలక భేటీకి పిలుపునిచ్చిన ఖర్గే, కాంగ్రెస్ ఎలక్షన్ ప్లాన్ రెడీ అయిపోయిందా?