Indian Ecomomy: భారతీయులు ఎక్కువగా టెన్షన్ పడే విషయాలివే- సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్!
Indian Ecomomy: పట్టణ భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందే విషయాలు ఏంటో తెలుసా?
![Indian Ecomomy: భారతీయులు ఎక్కువగా టెన్షన్ పడే విషయాలివే- సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్! Indians worry about unemployment, corruption; inflation concerns wane Indian Ecomomy: భారతీయులు ఎక్కువగా టెన్షన్ పడే విషయాలివే- సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/30/1f2b338aed61f412591aef32f31fcd081667111271923218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indians worry about unemployment: అవినీతి (Corruption), నిరుద్యోగం (Unemployment), ద్రవ్యోల్బణం (Inflation) ఇలా ఎన్నో సమస్యలు మన దేశంలో ఉన్నాయి. అయితే వీటిలో మన దేశ పౌరులు ఎక్కువగా ఆందోళనచెందే విషయాలేంటో తెలుసా? దీనిపై Ipsos అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
టెన్షన్
పట్టణంలో నివసించే భారతీయులు ఎక్కువ మంది నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి ఆందోళన చెందుతున్నారని ఈ సర్వేలో తేలింది. ఆసక్తికరంగా ప్రతి 10 మందిలో ఇద్దరు పౌరులు.. ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే 'వాట్ వర్రీస్ ది వరల్డ్' సర్వే అక్టోబర్ ఫలితాల ప్రకారం.. ద్రవ్యోల్బణంపై ఆందోళన గురించి సర్వే చేసిన 29 మార్కెట్లలో భారతదేశం చివరి స్థానంలో నిలిచింది.
ప్రపంచంలో
ప్రపంచవ్యాప్తంగా మాత్రం ద్రల్వోల్బణం గురించే ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. గత నెల కంటే ఇది 2 శాతం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పేదరికం, సామాజిక అసమానత, నిరుద్యోగం, క్రైమ్, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు సర్వే పేర్కొంది.
Ipsos ఆన్‌లైన్ ద్వారా ఈ సర్వే చేపట్టింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 మధ్య 29 దేశాలలో పౌరులపై Ipsos ఈ సర్వే నిర్వహించింది. 'వాట్ వర్రీస్ ది వరల్డ్' సర్వే ప్రస్తుతం పలు దేశాల్లో అత్యంత ముఖ్యమైన సామాజిక, రాజకీయ సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని ట్రాక్ చేస్తుంది.
ఈ సర్వేపై ఇప్సోస్ ఇండియా సీఈఓ అమిత్ అదార్కర్ మాట్లాడారు.. కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రపంచ మందగమనం.. భారతదేశం వంటి మార్కెట్లలో కూడా కనిపిస్తోందన్నారు.
నిజానికి, 76% పట్టణ భారతీయులు తమ దేశం సరైన దిశలో పయనిస్తోందని నమ్ముతున్నారు. ఈ పోల్‌లో సౌదీ అరేబియా టాప్‌లో నిలిచింది. సౌదీ అరేబియా పౌరులలో 93% మంది తమ దేశం సరైన మార్గంలో ఉందని నమ్ముతున్నారు.
Also Read: Kangana on Politics: కంగనాకు పార్టీలోకి స్వాగతం కానీ టికెట్ మాత్రం: నడ్డా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)