అన్వేషించండి

Army Helicopter Crash: జమ్ముకశ్మీర్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు గల్లంతు

జమ్ముకశ్మీర్ కథువాలోని ఓ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్.

జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కథువాలోని రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద ఓ హెలికాప్టర్ క్రాష్ అయింది. అయితే ఇది ఆర్మీకి చెందిన హెలికాప్టర్ గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి పయనమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతుంది. 

" చెరువులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మా బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. యుద్ధప్రాతిపదికిన చర్యలు చేపడతాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పూర్తి సమాచారం వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం.                "
-   ఆర్మీ అధికారి

ALSO READ:

Bandipora Encounter: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఇద్దరు గల్లంతు..

ప్రమాదం జరిగే సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. సాధారణ శిక్షణ నిమిత్తం హెలికాప్టర్ బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారుల ఆచూకీ గల్లంతైంది. లెఫ్టినెంట్ కల్నల్ ఏఎస్ భట్, కెప్టెన్ జయంత్ జోషి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ  డ్యామ్ పంజాబ్ పఠాన్ కోట్ కు 30 కిమీ దూరంలో ఉంది.

254 ఆర్మీ ఏవిషేయన్ స్కాండ్రన్ కు చెందిన ఈ హెలికాప్టర్ పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి 10.20 కి బయలుదేరగా కథువా వద్ద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో హెలికాప్టర్ డ్యామ్ లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ALSO READ:

CBSE 10th Result 2021 LIVE Updates: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..

కథువాలో రెండో ప్రమాదం..

జమ్ముకశ్మీర్ కథువాలో ఈ ఏడాది జనవరిలో కూడా ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్ కథవా జిల్లా లఖనాపుర్ లోని బషోలి బ్రిగేడ్ కేంద్రం వద్ద క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్ రిషభ్ శర్మ గాయాలపాలై మృతి చెందారు. కెప్టెన్ అంజనీ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటన మరువకముందే నేడు ఇంకో ప్రమాదం జరిగింది.

ALSO READ:
 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget