Bandipora Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ బందిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతి చెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు.
జమ్ముకశ్మీర్ బందిపొరాలో ఎన్ కౌంటర్ జరిగింది. జిల్లాలోని చాందజీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.
#BandiporaEncounterUpdate: 01 unidentified #terrorist killed. #Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/vrypp0iLDm
— Kashmir Zone Police (@KashmirPolice) August 3, 2021
ఆపరేషన్..
బందిపొరా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. తనిఖీలు ముమ్మరం చేశాయి.
షోక్ బాబా అటవీ ప్రాంతంలో జులై 23న చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఓ పాకిస్థాన్ ఉగ్రవాది కూడా ఉన్నాడు. మరో ఉగ్రవాది తప్పించుకున్నట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు.
ఆ ఉగ్రవాదిని పట్టుకునేందుకు నేడు చాందజీలో సెర్చ్ ఆపరేషన్ చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ ఉగ్రవాది బాబర్ అలీతో పాటు మరొక గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు.
వీళ్లే పోలీసుల లిస్టులో ఉన్న మోస్ట్ డేంజరస్ టెర్రరిస్టులు
మరోవైపు జమ్ముకశ్మీర్ పోలీసులు టాప్ టెన్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశారు. ట్విట్టర్‌లో పెట్టిన ఈ జాబితా ప్రకారం... ఏడుగురు ఎప్పటి నుంచో టెర్రరిస్ట్ గ్రూపుల్లో ఉండగా.... మిగతా ముగ్గురు కొత్తగా రిక్రూట్ అయ్యారు.
పోలీసులు విడుదల చేసిన జాబితాలో సలీం పర్రాయ్, యూసఫ్ కంట్రూ, అబ్బాస్ షేక్, రియాజ్ షెటెర్గండ్, ఫరూఖ్ నాలీ, జుబెయిర్ వాని, అష్రఫ్ మోల్వీ పాతవాళ్లు. వీళ్లు కొన్ని ఏళ్ల నుంచి ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు కొత్తగా టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరిన ముగ్గర్ని కూడా పోలీసులు మోస్ట్ వాటెండ్ లిస్టులో చేర్చారు. నకీబ్ మంజూర్, ఉమర్ ముస్తాక్ ఖండే, వకీల్ షా టెర్రర్ ఆర్గనైజేషన్‌లో కొత్తగా చేరారని జమ్ముకశ్మీర్ పోలీసులు చెబుతున్నారు.
కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ జాబితాను రెడీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న సరిహద్దుల్లో మళ్లీ అలజడి రేగుతోంది. ఈ మధ్య కాలంలో డ్రోన్లు పంపించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నిఘా పెంచాయి. ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడే వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.