అన్వేషించండి

Delhi High Court: భర్తను బహిరంగంగా అవమానించినా నేరమే, ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Delhi High Courtఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో భర్తను అవమానించేలా తిట్టడం, వ్యవహరించడం కూడా నేరమేనని స్పష్టం చేసింది. 

Wife Insulting Husaband Is Crime : ఢిల్లీ హైకోర్టు ( Delhi High Court ) సంచలన వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో (Abuse Is In Public Place ) భర్త(Husband)ను భార్య (Wife ) అవమానించేలా తిట్టడం, వ్యవహరించడం కూడా నేరమేనని స్పష్టం చేసింది. ఓ జంటకు 2000 సంవత్సరంలో వివాహం అయింది. నాలుగేళ్లకు వారికి పుత్రుడు జన్మించాడు. తర్వాత రెండేళ్లకు భార్య, భర్తను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. భర్త పని చేసే కార్యాలయానికి వెళ్లి, అతని సహచర ఉద్యోగుల ముందే అవమానకర వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు మహిళల పిచ్చి అని, సంసారానికి పనికి రాని వాడని ఘోరంగా అవమానించింది. అంతటితో ఆగని సదరు మహిళ కుమారుడితో తండ్రిని తిట్టించింది. భార్య వేధింపులు పెరగడంతో విడాకులు కోరుతూ భర్త కోర్టును ఆశ్రయించాడు. భర్త వినతికి కోర్టు అంగీకారం తెలిపింది. ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది. కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ...భార్య హైకోర్టులో అప్పీల్ చేసింది. 

గతంలో చెన్నై కోర్టు తీర్పు
గతంలో చెన్నై కోర్టు సైతం భార్యాభర్తల వ్యవహారంలో ఇలాగే వ్యాఖ్యానించింది. సి. శివకుమార్, శ్రీ విద్యకు 2008లో వివాహం జరిగింది. అయితే, ఒక పాప పుట్టిన తర్వాత 2011 నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. వైవాహిక బంధాన్ని కొనసాగించాలనే ప్రయత్నాలు విఫలం కావడంతో విడాకులు కోరుతూ శివకుమార్ పిటిషన్ వేశారు. భర్త వ్యక్తిత్వాన్ని అనుమానించి, పని చేస్తున్న ఆఫీసుకు వెళ్లి పరువు తీయడం క్రూరత్వం కిందకే వస్తుందంటూ...ఓ జంటకు విడాకులు మంజూరు చేసింది. భార్య చేసిన ఈ చర్య హిందూ వివాహ చట్టం లోని సెక్షన్ 13(1) ప్రకారం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు వెల్లడించింది. భర్త ప్రతిష్టకు తీవ్రమైన భంగం కలిగిస్తుందని చెప్పింది. దీంతో పాటు, భార్య తాళిని తొలగించడం కూడా వైవాహిక బంధాన్ని కొనసాగించేందుకు ఆసక్తి లేదని చెప్పడమేనని తెలిపింది. భాగస్వామి వ్యక్తిత్వాన్ని అనుమానించడం, ఆఫీసుకు వెళ్లి గొడవ చేయడం, సహోద్యోగులతో శారీరక సంబంధాలున్నాయని ఆరోపించడం క్రూరత్వం కింద పరిగణించవచ్చని మద్రాస్ హైకోర్టు గతేడాది జూలై 05న తీర్పు ఇచ్చింది. 

భర్తకు వేరే మహిళలతో సంబంధాలున్నాయని అవమానకర వ్యాఖ్యలు

భర్తకు వేరే మహిళలతో సంబంధాలున్నాయని, వారితో అర్ధరాత్రి వరకూ మాట్లాడుతూ ఉంటారని స్థానిక పోలీసు స్టేషన్‌లో శ్రీ విద్య ఫిర్యాదు చేశారు. తమ కూతురి భవిష్యత్తు కోసం భర్తతో కలిసి జీవించాలని అనుకుంటున్నట్లు ఇదే ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసును విచారించిన జస్టిస్ వి.ఎం వేలుమణి, జస్టిస్ ఎస్. సౌందర్‌లతో కూడిన బెంచ్ విడాకులు మంజూరు చేసింది.  భాగస్వామిని మానసికంగా, శారీరకంగా వేధించడం, భాగస్వామి ప్రతిష్టను భంగపరిచే విధంగా ప్రవర్తించడం క్రూరత్వం కిందకే వస్తుందని న్యాయవాదులు చెబుతున్నారు. భాగస్వామి వ్యక్తిత్వాన్ని బహిరంగంగా కించపరిచే అధికారం ఎవరికీ ఉండదని, చట్టంలో కూడా ఉందన్నారు. గృహ హింస కేసుల్లో తమ హక్కులను కాపాడుకోవడం కంటే, అవతలి వ్యక్తి పై పగ తీర్చుకోవడమే ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Hyundai Discount: హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Hyundai Discount: హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
Pushpa 2: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
Embed widget