Vijay Sai Reddy News: కాకినాడ సెజ్, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్ అవుట్ నోటీసులు
Lookout Notice To Vijay Sai Reddy: కాకినాడ సెజ్,పోర్టు అక్రమాల కేసులు మరో టర్న్ తీసుకున్నాయి. ఈ కేసులో నిందితులు పారిపోకుండా ఏపీ సీఐడీ LOC జారీ చేసింది.
Kakinada Port Case News Today: కాకినాడ సెజ్, పోర్టు కేంద్రంగా నమోదైన కేసులు వైసీపీ నేతల మెడకు గట్టిగా చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. కేవీ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరూ విదేశాలకు పారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడి బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో కంపెనీ యజమాని శరత్ చంద్ర రెడ్డిపై కూడా ఈ నోటీసులు తీసుకొచ్చింది.
కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బెదిరించి భయపెట్టి తన వద్ద నుంచి తక్కువ ధరకే లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. 3,600 కోట్ల రూపాయల విలువైన వాటాలు చెప్పన ధరకు రాసివ్వకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించిన్టటు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాం.
గత కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కేసులు చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు కేసులో ఊబీలో ఇరుక్కపోతున్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు కాకినాడ కేంద్రంగా చేసుకొని దందాలకు పాల్పడ్డారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో కీలక నేతలంతా బుక్ అయ్యారు.
కాకినాడు పోర్టు కేంద్రంగా పార్టీ అధినేత నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు మైండ్ గేమ్ ఆడి కోట్ల రూపాయల వాటలను చీఫ్‌గా కొట్టేశారనేది ఇప్పుడు నడుస్తున్న కేసు. కాకినాడ పోర్టులో రూ.2,500 కోట్లు విలువైన వాటాను కేవలం రూ.494 కోట్లకే అరబిందో సంస్థకు అప్పగించడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. రూ.1,109 కోట్లు విలువైన సెజ్‌ను కేవలం రూ.12 కోట్లుకే అప్పగించడం సంచలనంగా మారింది. ఈ ఆస్తులు కావాల్సిన సంస్థలకు, వ్యక్తులకు అప్పగించుకునేందుకు కాకినాడ పోర్టు, సెజ్ నుంచి బయటకు వెళ్ల గొట్టారంటూ కేవీ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!
2020 మే నెలలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు ఫోన్ చేసి కాకినాడ సీపోర్టు విషయంలో మాట్లాడారని కేవీరావు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయంపై వైవీ సుబ్బారెడ్డికు మారుడు విక్రాంత్ రెడ్డితో మాట్లాడాలని సూచించినట్టు తెలిపారు. విక్రాంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు అక్కడే అరబిందో సంస్థ యజమాని విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నట్టు వివరించారు.
స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం కేఎస్‌పీఎల్ రూ.1,000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని వాళ్లు చేపినా తప్పు చేయలేదు భయపడలేదని తాను సమాధానం చెప్పినట్టు పేర్కొన్నారు కేవీరావు. రికార్డులను ఆడిటర్లు ఫ్యాబ్రికేట్ చేసి తప్పుడు నివేదికలు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నోటీసులిస్తే ఇబ్బందులు తప్పవని జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించినట్టు ఫిర్యాదులో వెల్లడించారు. అందుకే కేఎస్‌పీఎల్‌లో ఉన్న 50 శాతం వాటా, కాకినాడ సెజ్‌లోని 48.74 శాతం వాటాలను చెప్పిన రేటుకు బదిలీ చేసి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు.
ఇదంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. మాట వినకంటే క్రిమినల్ కేసులు విజిలెన్స్ దాడులు తప్పవని జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏపీ సీఐడీ ఐపీసీ 506, ఐపీసీ 384, ఐపీసీ 420, ఐపీసీ 109, ఐపీసీ 467, 120బీ, బీఎస్‌ఎస్ 111 సెక్షన్ల క్రింద అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేసింది. వై.విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పి.శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం, ఎల్‌ఎల్‌పీ ఆడిట్ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసులు పెట్టింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి,శరత్ చంద్రారెడ్డి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది.
Also Read: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్ అక్రమాలపై సీఐడీ విచారణ