Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Harish Rao Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హైకోర్టు ఓకే చెప్పింది. అయితే హరీష్‌ను మాత్రం అరెస్టు చేయొద్దని ఆదేశించింది.
Telangana High Court Comments On Harish Phone Tapping Case : మాజీ మంత్రి హరీష్‌రావు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి అభ్యర్థను తోసిపుచ్చింది. అయితే అరెస్టు చేయొద్దని విచారణ మాత్రం చేయాలని ఆదేశించింది.
అధికారంలో ఉన్నప్పుడు హరీష్‌రావు ఓ అధికారితో కలిసి తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులో ఎలాంటి మెరిట్ లేకుండానే తనపై కేసు నమోదు చేశారని వాదించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వాదించారు.
నిజానిజాలు తేల్చందుకే కేసు నమోదు చేశామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ తీర్పు వెల్లడించారు. కేసులు క్వాష్ చేయడానికి అంగీకరించలేదు. ఈ కేసులో విచారణ చేసుకోవచ్చని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ హరీష్‌ను అరెస్టు చేయకుండా విచారించుకోవచ్చని పేర్కొన్నారు.