India Pakistan Attack News : బుల్డోజర్లు కూడా యుద్ధం చేస్తాయి! శత్రువుల ప్లాన్‌లను ఎలా తిప్పికొడతాయో తెలుసా?
India-Pakistan Attack News : ఆధునిక ఆయుధాలు ఎన్ని ఉన్నప్పటికీ కొన్ని సంప్రదాయ పరికరాలు, వాహనాలను కూడా యుద్ధంలో వాడతారు. అలాంటి వాటిలో బుల్డోజర్ కూడా ఉంది.

India-Pakistan Attack News :పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల 9 కేంద్రాలపై దాడి చేసిన భారత్ 100 మందికిపైగా ఉగ్రవాదులను చంపింది. దీని తరువాత పాకిస్తాన్ జమ్మూ-కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాలపై డ్రోన్, క్షిపణుల దాడులకు విఫలయత్నం చేసింది. దీనిని భారతదేశం విజయవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు భారతదేశపు మూడు సైనిక విభాగాలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆధునిక వార్ వెపన్స్ ఎన్ని ఉన్నప్పటికీ యుద్ధ సమయంలో బుల్డోజర్‌ను కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా? ఇది శత్రువుల ప్రణాళికలను ఎలా నిర్మూలిస్తుంది?
యుద్ధంలో బుల్డోజర్ ఎందుకు ఉపయోగిస్తారు?
యుద్ధ సమయంలో బుల్డోజర్‌ను కూడా ఉపయోగిస్తారని గమనించాలి. అయితే, దీనిని తుపాకులు, ట్యాంకులు లేదా క్షిపణులు వంటి సాంప్రదాయ ఆయుధాల మాదిరిగా నేరుగా దాడి చేయడానికి ఉపయోగించరు. ఇది సైన్యానికి సహాయపడటానికి, వ్యూహాత్మక ఉద్దేశ్యాల కోసం యూజ్ చేస్తారు. నిజానికి, బుల్డోజర్లు ప్రధానంగా సైనిక ఇంజనీరింగ్ , సరఫరాను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
యుద్ధంలో బుల్డోజర్ ఇలా ఉపయోగపడుతుంది
యుద్ధ సమయంలో బుల్డోజర్‌ను వెళ్లడానికి వీలులేని ప్రాంతాలలో రోడ్లు నిర్మించడం నుంచి చెత్తను తొలగించడం వరకు ఉపయోగిస్తారు. దీని ద్వారా ట్యాంకులు వంటి సైనిక వాహనాలకు మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా, యుద్ధ ప్రాంతాలలో తాత్కాలిక విమానాశ్రయాలను నిర్మించడానికి కూడా బుల్డోజర్ ఉపయోగిస్తారు. దీని సహాయంతో భూమిని చదును చేస్తారు. అంతేకాకుండా, LOC ప్రాంతాలలో గుంతలలు త్రవ్వడం నుంచి బంకర్లను నిర్మించడం వరకు బుల్డోజర్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే, సైనికులకు సహాయపడటానికి యూజ్ చేస్తారు. దారికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించడానికి బుల్డోజర్ ఉపయోగించబడుతుంది.
యుద్ధంలో ఉపయోగించే బుల్డోజర్లు ఎలా ఉంటాయి?
యుద్ధ సమయంలో ఉపయోగించే బుల్డోజర్లు సాధారణ బుల్డోజర్లకు భిన్నంగా ఉంటాయి. దీని కోసం కొన్ని బుల్డోజర్లను డిజైన్ చేస్తారు. తద్వారా అవి కాల్పులు పేలుళ్లను తట్టుకోగలవు. అంతేకాకుండా, ఇప్పుడు రోబోటిక్ బుల్డోజర్లు కూడా తయారవుతున్నాయి, అవి రిమోట్ ద్వారా నడుస్తాయి. ఆటోమేటిక్‌గా కూడా పనిచేస్తాయి. వీటిని తయారు చేయడం వెనుక ఉద్దేశ్యం సైనికులను ప్రమాదం నుంచి కాపాడటమే.
ఏప్రిల్ 22 నుంచి రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తత
జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఆ సమయంలో పర్యాటకులను మతం అడిగి కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాదుల కేంద్రాలను ధ్వంసం చేసింది, ఇందులో లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి. అనంతరం పాకిస్థాన్ కుట్రలకు పాల్పడుతోంది. తినడానికి తిండి లేకపోయినా భారత్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.
గురువారం వేకువ జామును పదిహేను స్థావరాలను టార్గెట్‌గా చేసుకుంది. వాటిని భారత్ సునాయాసంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ క్షిపణులు బోర్డర్ దాటకుండానే పేల్చేసింది. ఎంత పరాభవం ఎదురవుతున్నా సరే సాయంత్రానికి మళ్లీ సరిహద్దుల్లో అలజడి రేపింది. డ్రోన్లు, క్షిపణులను దాడికి పంపించింది. వాటిని కూడా భారత్ ఈజీగా హ్యాండిల్ చేసింది. పాకిస్థాన్ సరిహద్దు దాటి రాలేకపోతుంటే... భారత్ మాత్రం నేరుగా వాళ్ల రాజధానిపైనే బాంబులు వేసింది.






















