Drone Attack on Lahore : లాహోర్, సియోల్‌కోట్‌పై డ్రోన్ దాడి- పాకిస్థాన్‌కు దీటుగా బదులిస్తున్న భారత్
Drone Attack on Lahore : మీరు తగ్గే వరకు మేం తగ్గం అన్నట్టుగానే భారత సైన్యం పాకిస్థాన్‌కు బదులిస్తోంది. మీరు డ్రోన్‌లతో సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తే మీ నగరాలపైనే దాడులు చేస్తామంటూ హెచ్చరికలు పంపుతోంది.

Drone Attack on Lahore : భారత్‌పై దాడికి కుటిలయత్నాలు చేస్తున్న పాకిస్థాన్‌కు దీటుగా బదులు ఇవ్వాలనే భారత్ నిర్ణయించినట్టు కనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా సరిహద్దు దాటి అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది పాకిస్థాన్. రక్షణ వ్యవస్థ అంత పటిష్ఠంగా మార్చుకుంది భారత్. నిన్నటి నుంచి ఎన్నో సార్లు క్షిపణులతో భారత్‌లోని సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది పక్కనే ఉన్న ఉగ్రదేశం. కానీ వాటిని దీటుగా ఎదుర్కొంటున్న సైన్యం వారిని బోర్డర్‌లోనే అడ్డుకుంటోంది. కుప్పకూలుస్తోంది..
పాకిస్థాన్ సరిహద్దు దాటి రాలేకపోతుంటే... భారత్ మాత్రం ఏకంగా ఆ దేశంలోని కీలక నగరాల్లోకి వెళ్లి దాడులు చేస్తోంది. ఇప్పటికే చాలా నగరాలను టార్గట్ చేసుకొని విధ్వంసం చేసింది. ఇప్పుడు లాహోర్‌లో డ్రోన్ దాడి చేసింది భారత్. గురువారం సాయంత్రం నుంచి సరిహద్దు వద్ద పాకిస్థాన్ చేస్తున్న దాడులకు అదే స్థాయిలో జవాబు చేస్తోంది. సరిహద్దు ప్రాంతాల‌్లో పాకిస్తాన్ వరుస డ్రోన్ దాడుల తర్వాత భారత్ ఈ దాడి చేసింది.
#BREAKING | भारत ने शुरू की जवाबी कार्रवाई , लाहौर पर किया ड्रोन अटैक @chitraaum | @neeraj_rajput | https://t.co/smwhXURgtc #operationsindoor #Pakistan #JammuKashmir #BreakingNews #PMModi #NSA pic.twitter.com/qWOvMaAqTN
— ABP News (@ABPNews) May 8, 2025
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో తమ AWACS (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) విమానం కూలిపోయిందని పాకిస్తాన్ వైమానిక దళం ప్రకటించింది.





















