అన్వేషించండి

Indian Student Dies: అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి

Saketh Sreenivasaiah Tragedy in USA | అమెరికాలో మిస్సింగ్ ఇండియన్ స్టూడెంట్ కథ విషాదాంతమైంది. సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Indian Student Dies in USA: శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఘటన విషాదాంతంగా ముగిసింది. సాకేత్ శ్రీనివాసయ్య చనిపోయాడని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన సాకేత్, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసేందుకు వచ్చాడు. 22 ఏళ్ల వయసున్న సాకేత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ బయోమాలికులర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 9 నుంచి సాకేత్ కనిపించకుండా పోవడంతో అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు, క్యాంపస్‌కు సమీపంలోని లేక్ అంజా వద్ద సాకేత్ ఆఖరిసారిగా కనిపించినట్లు ఆధారాలు లభించాయి. తనిఖీల్లో భాగంగా మొదట సాకేత్ శ్రీనివాసయ్య పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను గుర్తించిన అధికారులు, ఆ తర్వాత అదే ప్రాంతంలో సాకేత్ మృతదేహాన్ని గుర్తించారు. సాకేత్ శ్రీనివాసయ్య మృతి పట్ల భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

విద్యార్థి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఈ కష్టకాలంలో విద్యార్థి సాకేత్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. మిస్సింగ్ స్టూడెంట్ దాదాపు వారం రోజుల తరువాత డెడ్‌బాడీగా కనిపించాడని తెలియడంతో సాకేత్ కుటుంబసభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్నేళ్లుగా అమెరికా సహా విదేశాలలో భారత విద్యార్థుల మరణాలు పెరిగిపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget