అన్వేషించండి

Prime Minister Modi: కాంగ్రెస్‌కు విజన్, ప్రణాళకలేమీ ఉండవు -రాజ్యసభలో మోదీ విమర్శలు

MODI: భారత్ మూడో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.

Prime Minister Modi speech in Rajya Sabha:  ఇండియా బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలు స్థాయి నుండి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశలో వేగంగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ క్రమం మారుతోందని, ప్రస్తుతం ప్రపంచం భారతదేశం వైపు విశ్వబంధుగా చూస్తోందని స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇచ్చారు. భారతదేశం ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా మారిందని నొక్కి చెప్పారు.

విజన్ లేని కాంగ్రెస్ 
 
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వద్ద ఎటువంటి ఆలోచనలు, విజన్ లేదా ప్రణాళికలు లేవని, ఆ పార్టీ గతంలో చేసిన తప్పులను సరిదిద్దడానికే తమ శక్తి అంతా ఖర్చవుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా యూపీఏ హయాంలో జరిగిన బ్యాంకింగ్ అవకతవకలను ప్రస్తావిస్తూ, అప్పట్లో  ఫోన్ బ్యాంకింగ్ సంస్కృతి ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చేలా చేశారని ఆరోపించారు. రవ్‌నీత్ బిట్టుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. సిక్కు కాబట్టే బిట్టును రాహుల్ అవమానించారని విమర్శించారు. 

సంస్కరణలు , వాణిజ్య ఒప్పందాలు 

రిఫార్మ్, పెర్ఫార్మ్,  ట్రాన్స్‌ఫార్మ్ అనే సూత్రంతో దేశం ప్రస్తుతం  రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఉందని ప్రధాని తెలిపారు. అమెరికా,  యూరోపియన్ యూనియన్ తో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలను ఆయన ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశ స్థిరత్వానికి , భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. గతంలో రక్షణ ఒప్పందాలు అంటే  బోఫోర్స్ వంటి అవినీతి గుర్తొచ్చేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు.       

బెంగాల్ సర్కార్ పై విమర్శలు
 
పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు  గుప్పించారు. చొరబాటుదారులను రక్షించడానికి ఆ ప్రభుత్వం కోర్టులను ఆశ్రయిస్తోందని మోదీ ఆరోపించారు. ఈ చొరబాటుదారులు స్థానిక యువత ఉపాధిని, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చొరబాటుదారులను పంపివేస్తుంటే, ఇక్కడ మాత్రం వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రక్షిస్తున్నారని విమర్శించారు.

ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా  సభకు హాజరు కాలేదు. మోదీపై దాడికి కాంగ్రెస్ సభ్యులు కుట్ర పన్నారని అందుకే తానే ప్రధాని మోదీని రావొద్దని సూచించానని స్పీకర్ బిర్లా తెలిపారు.             

టాప్ హెడ్ లైన్స్

Asian Games Draw: 2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!
2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
Amroha Three Sisters Marriage: ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్న వ్యక్తి - వీడియో వైరల్ - కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో
ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్న వ్యక్తి - వీడియో వైరల్ - కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget