Shashi Tharoor son: శశిథరూర్ కొడుకును ఉద్యోగం నుంచి తీసేసిన వాషింగ్టన్ పోస్ట్ - కారణం పాతదే !
Washington Post: శశిథరూర్ కుమారుడు ఈశాన్ తన ఉద్యోగం కోల్పోయారు. అమెరికాలో వాషింగ్టన్ పోస్టులో పని చేస్తున్న ఆయనను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది.

Shashi Tharoor son laid off from The Washington Post: ప్రముఖ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కుమారుడు ఈశాన్ థరూర్ ను వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈశాన్ సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక నుండి ఉద్వాసనకు గురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. దాదాపు 12 ఏళ్ల పాటు ఆ పత్రికలో విదేశీ వ్యవహారాల విశ్లేషకుడిగా, కాలమిస్టుగా ఈశాన్ పని చేశారు. సంస్థ చేపట్టిన కాస్ట్ కటింగ్ చర్యల్లో భాగంగా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఈ వార్తను ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ఒక దశాబ్దానికి పైగా సాగిన తన ప్రయాణం ముగియడం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ వార్తపై శశి థరూర్ స్పందిస్తూ తన కుమారుడికి బాసటగా నిలిచారు. ఒక తండ్రిగా ఈ పరిణామం తనను బాధించినప్పటికీ, ఈశాన్ ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక తలుపు మూసుకుంటే మరొకటి తెరుచుకుంటుంది అని వ్యాఖ్యానిస్తూ, 12 ఏళ్ల పాటు ప్రపంచ స్థాయి పత్రికలో అద్భుతమైన విశ్లేషణలు అందించిన ఈశాన్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలను అందుకుంటాడని థరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ అంశాలను సరళంగా వివరించడంలో ఈశాన్ కున్న ప్రత్యేక గుర్తింపు అతడిని ముందుకు నడిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం కారణంగానే ది వాషింగ్టన్ పోస్ట్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకటనల రాబడి తగ్గడం , డిజిటల్ మార్పుల కారణంగా సంస్థ తన సిబ్బందిని తగ్గించుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈశాన్ థరూర్ వంటి సీనియర్ జర్నలిస్టులు కూడా లేఆఫ్స్ బారిన పడుతున్నారు. కేవలం ఈశాన్ మాత్రమే కాకుండా, మరికొంత మంది ప్రతిభావంతులైన జర్నలిస్టులను కూడా ఆ పత్రిక పంపించివేసింది.
#ShashiTharoor | कांग्रेस सांसद शशि थरूर के बेटे ईशान थरूर भी उन पत्रकारों में शामिल हैं जिन्हें द वाशिंगटन पोस्ट ने नौकरी से निकाल दिया है। अखबार ने अपने अंतरराष्ट्रीय कवरेज और खेल विभाग में बड़े पैमाने पर छंटनी की घोषणा की है।https://t.co/Cx3sGBXpeC#ishantharoor… pic.twitter.com/vG0qIGMuz3
— Moneycontrol Hindi (@MoneycontrolH) February 5, 2026
ఈశాన్ థరూర్ తన కెరీర్ టైమ్ మ్యాగజైన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రారంభించారు. ఆ తర్వాత వాషింగ్టన్ పోస్ట్‌లో స్థిరపడ్డారు. ముఖ్యంగా భౌగోళిక రాజకీయాలు , అంతర్జాతీయ సంబంధాలపై ఆయన రాసే వరల్డ్ వ్యూ కాలమ్ కు ప్రపంచవ్యాప్తంగా పారకులు ఉన్నారు. ఉద్యోగం కోల్పోయినప్పటికీ, తన మేధస్సు , అనుభవంతో ఆయన త్వరలోనే మరో అంతర్జాతీయ పత్రికలో కీలక బాధ్యతలు చేపడతారని మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
























