అన్వేషించండి

Shraddha murder case: శ్రద్ద హత్యపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు, ఇది లవ్ జీహాద్‌ కాదన్న ఒవైసీ!

ఢిల్లీలో జరిగిన ఈ దారుణమైన హత్య ఇప్పుడు దేశమంతా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసుకు మతం రంగు పులమడంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసుపై తాజాగా స్పందించారు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. ఇది ముమ్మాటికి లవ్‌ జీహాద్‌ కాదని అన్నారు. ఇటు అసోం సీఎం బిస్వాశర్మ మాత్రం.. ముమ్మాటికీ ఇది లవ్‌ జీహాదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ దారుణమైన హత్య ఇప్పుడు దేశమంతా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓవైసీ.. ఇది లవ్‌ జిహాద్‌ ఘటన కానేకాదన్నారు. బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. 

ఇది లవ్ జీహాద్ సమస్య కాదని ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్య అని దీన్ని అందరూ ఖండిచాలని ఓవైసీ అన్నారు. అంతేకాదు ఈ ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని.. ఈ కేసుకు మతం రంగు పులిమారని ఘాటుగా వ్యాఖ్యానించారు ఓవైసీ. మొత్తానికి శ్రద్దా హత్యను మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలని ఓవైసీ చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ముంబై నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ క్రైమ్‌ సీరియల్‌లో రోజుకో కొత్త టర్నింగ్‌ వెలుగులోకి వస్తోంది. కొత్త కొత్త ట్విస్ట్‌లు తెర మీదకు వస్తున్నాయి. 2020లో కూడా హత్యకు అఫ్తాద్‌ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ముందే ఓ సారి.. శ్రద్దను చంపేందుకు అఫ్తాద్‌ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆ గొడవ పెద్దదిగా మారింది. సమస్యపై 23 నవంబర్ 2020లోనే ముంబై నలసుపరా పోలీస్ స్టేషన్‌లో శ్రద్ధ ఫిర్యాదు చేసింది. స్నేహితులకు కూడా చెప్పుకుంది శ్రద్ధ. పోలీసులకు రాసిన లేఖలో తన లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని.. తన మృతదేహాన్ని ముక్కలుగా నరికివేస్తానని బెదిరిస్తున్నాడని శ్రద్ధా వాకర్ ఆరోపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన లేఖ ద్వారా ఆఫ్తాబ్ శ్రద్ధాను క్రమం తప్పకుండా కొట్టేవాడని తెలుస్తోంది. ఆరు నెలలుగా అతను నన్ను కొడుతున్నాడని.. అఫ్తాబ్ తనను కొట్టాడని, చంపడానికి ప్రయత్నించాడని అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసునని లేఖలో పేర్కొంది.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ కేసులో సంచలన విషయాలు
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ కేసులో సంచలన విషయాలు
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget