Shigella Virus: కేరళలో మరో ప్రాణాంతక వైరస్- కొత్తదేం కాదు, కానీ రిస్క్ మాత్రం ఒకటే!
Shigella Virus: కేరళలో మరోసారి షిగెల్లా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్‌లో ఓ బాలికలో ఈ వైరస్ గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Shigella Virus: ఓవైపు కరోనా వైరస్‌తో సతమతమవుతుంటే కేరళలో మరో వైరస్ మళ్లీ పుట్టుకొచ్చింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో షిగెల్లా వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు.
రెండు కేసులు
ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. బాలిక పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయన్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు.
వ్యాప్తి ఎలా?
షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు తీవ్రమైతే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. షిగెల్లా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్‌లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
లక్షణాలు
జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట వంటివి షిగెల్లా వ్యాధి ప్రధాన లక్షణాలు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆర్ఎస్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు వంటివి తాగి రీహైడ్రేట్ చేసుకోవాలి. కాచి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలి.
వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు
- కాచి వడబోసిన నీటినే తాగండి.
- చేతులను తరచూ సబ్బుతో కడుక్కోండి.
- పరిశుభ్రత పాటించండి.
- బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరాదు.
- పిల్లల డైపర్లను ఎక్కడ బడితే అక్కడ కాకుండా డస్ట్ బిన్‌లోనే వెయ్యాలి.
- వ్యాధి లక్షణాలు ఉన్నవారితో వంటలు చేయించవచ్దు.
- నిల్వ ఉంచిన ఆహారం తినవద్దు.
- ఆహారాన్ని సరిగా కప్పి ఉంచండి.
- వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఇతరులకు దూరంగా ఉండాలి.
- టాయిలెట్లు, బాత్‌రూమ్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- పరిశుభ్రత లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
- వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లవద్దు.
- పండ్లు, కూరగాయలను కడిగి మాత్రమే వాడాలి.
కేరళలో ఇది వరకు కూడా ఈ వ్యాధి వచ్చింది. 2019లో కోయిలాండీలో, 2020లో కోజికోడ్‌లో పలువురికి ఈ వ్యాధి సోకింది.
Also Read: Viral News: బాల్కనీలో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి, లేకపోతే రూ. 20 వేలు ఫైన్!
Also Read: Elon Musk About Coca-Cola: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన- ఆ కంపెనీ కొనేస్తారట!