Elon Musk About Coca-Cola: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన- ఆ కంపెనీ కొనేస్తారట!
Elon Musk About Coca-Cola: ఎలాన్ మస్క్ చేసిన తాజా ట్వీట్ వైరల్ అయింది. త్వరలోనే మరో ప్రముఖ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
Elon Musk About Coca-Cola: ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి సిద్ధమయ్యారా? ఆయన తీరు చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఆయన చెప్పినప్పుడు అందరూ ఏదో సరదాగా అంటున్నారని అనుకున్నారు. కానీ ట్విట్టర్‌ను కొనేసి మస్క్ అందరికీ షాకిచ్చారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఈసారి ఆయన ఏం కొంటున్నారో తెలుసా?
అంతే మరి
ఈ రోజు ఉదయం మస్క్ ఓ ట్వీట్ చేశారు. తాను తర్వాత 'కోకా కోలా'ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తయారీతో మల్టీనేషనల్ కంపెనీగా పేరున్న ఈ అమెరికన్ కంపెనీని, మస్క్ చేజిక్కిచుకోనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
కోకా కోలా
ఈ ట్రేడ్‌మార్క్ శీతల పానీయంలో రెండు ప్రాథమిక పదార్థాలు ఉండేవి. కోకా ఆకులు, కోలా గింజలు. కోలా గింజలు కెఫిన్ మూలం కాగా, కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ 'కొకైన్' వస్తుంది. కోకా-కోలా ఒకానొక సమయంలో ఎక్కువగా కోకా ఆకుల మీదే ఆధారపడింది. కొకైన్‌ను ఆ కాలంలో ఔషధంగా పరిగణించినప్పటికీ ఆ తర్వాత నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో అమెరికా దానిని నిషేధించింది. దీంతో కోకా ఆకులు దూరమై బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులు ఈ పానీయంలో చేరాయి.
మరి చేస్తారా?
కోకా కోలాకు తిరిగి 'కొకైన్' వైభవం తీసుకొస్తానంటూ మస్క్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. మరి అద్భుతాలను అందుకోవడంలో మస్క్‌కు మంచి పేరు ఉంది. మరి ట్విట్టర్ కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిన ఆయన కోకా కోలాను కూడా కొనేస్తారేమో చూడాలి.
డీల్ తరువాత..
ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. "ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా ప్రసంగం పునాదిగా ఉంటుంది. ట్విట్టర్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫామ్. ట్విట్టర్ వేదికలో మానవాళికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి" అని ఎలాన్ మస్క్ సోమవారం ట్వీట్ చేశారు.
Also Read: Elon Musk Buys Twitter: ఎలాన్ మస్క్ ఓ వింత మనిషి- అంతేనా కాదు అంతకుమించి!