Elon Musk Buys Twitter: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్, 44 బిలియన్ డాలర్లకు భారీ డీల్ - అనుకున్నది సాధించిన కుబేరుడు
Elon Musk Twitter Deal: ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటానని ప్రకటించిన 10 రోజులకు కీలక పరిణామం జరిగింది. ట్విట్టర్ బోర్డుతో ఎలాన్ మస్క్ చర్చలు సఫలమయ్యాయి.
Elon Musk Buy Twitter: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ అనుకున్నది సాధించారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటానని ప్రకటించిన 10 రోజులకు కీలక పరిణామం జరిగింది. ట్విట్టర్ బోర్డుతో ఎలాన్ మస్క్ చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ డీల్ కుదుర్చుకున్నారు. సోమవారం ఉదయం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో ట్విట్టర్ బోర్డు జరిపిన చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి.
షేర్లు కొనుగోలు చేసిన కొన్నిరోజులకే భారీ ఒప్పందం..
దాదాపు రెండు వారాల కిందటే ట్విట్టర్ సంస్థలలో 9 శాతం వాటా కొనుగోలు చేసినట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున కపెంనీని (Elon Musk Twitter Deal) మొత్తం షేర్లను 46.5 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకున్నారు మస్క్. ఎలాన్ మస్క్‌తో ట్విట్టర్ బోర్డు ఒప్పందం దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో సోమవారం నాడు సంస్థ షేర్లు దూసుకెళ్లాయి. ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు 4 శాతానికి పైగా ఎకబాకింది. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకోబోతున్నారనే ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
🚀💫♥️ Yesss!!! ♥️💫🚀 pic.twitter.com/0T9HzUHuh6
— Elon Musk (@elonmusk) April 25, 2022
ఎడిట్ ఆప్షన్‌తో మొదలుపెట్టి, సంస్థనే హస్తగతం..
టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో ఎడిట్ బటన్లు ఇవ్వాలని, పలు అంశాలలో సంస్థ విఫలమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్ చేసే సూచనలు తమకు ప్రయోజనం చేకూర్చేవని భావించిన సంస్థ ఎలాన్ మస్క్‌ను డైరెక్టర్‌గా చేరాలని ఆహ్వానించింది. కానీ తాను డైరెక్టర్‌గా చేరనని.. స్టేక్ హోల్డర్‌గా ఉండేందుకు సరేనని ట్విట్టర్‌తో డీల్‌కు ఓకే చెప్పారు. కానీ ఆ సంస్థలో డైరెక్టర్ అయితే అమెరికా చట్టాల ప్రకారం 15 శాతం వాటాకు మించి కొనుగోలు చేసే అవకాశం లేదు. ఆ కారణం చేత తాను స్టేక్ హోల్డర్‌గా ఉంటానని మాస్క్ ట్విట్టర్ బోర్డుకు తెలిపారు. ఈ క్రమంలో తాను ట్విట్టర్ మొత్తాన్ని కొనుగోలు చేయాలని ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్ మాస్క్ భావించి తన ఆఫర్ ప్రకటించారు. 10 రోజుల్లోగా ట్విట్టర్ బోర్డుతో చర్చించి కంపెనీని హస్తగతం చేసుకోవడంలో విజయం సాధించారు ఎలాన్ మస్క్.
డీల్ తరువాత ఎలాన్ మస్క్ ట్వీట్..
"ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా ప్రసంగం పునాదిగా ఉంటుంది. ట్విట్టర్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫామ్. ట్విట్టర్ వేదికలో మానవాళికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి" అని ఎలాన్ మస్క్ సోమవారం ఒక ప్రకటనలో తెలుపుతూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కంపెనీకి అద్భుతమైన సామర్థ్యం ఉంది. ట్విట్టర్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మస్క్ అన్నారు.
Also Read: Elon Musk Twitter Deal: మస్క్ ఆఫర్‌కు ట్విట్టర్ ఓకే చెప్పేసిందా! షేర్లు రయ్ రయ్!
Also Read: Elon Musk Twitter Bid: ట్విటర్ ఎందుకుగానీ! ఆ అప్పులు తీర్చేసి శ్రీలంకను కొనేయొచ్చుగా మస్క్!