Viral News: బాల్కనీలో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి, లేకపోతే రూ. 20 వేలు ఫైన్!
ఉతికేసిన బట్టలు బాల్కనీలో ఆరేయడం సాధారణ విషయమే. కానీ ఆ దేశంలో అలా ఆరేస్తే రూ. 20 వేలు ఫైన్ వేస్తారు. అవును ఇది నిజం.

పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో ఉండేవాళ్లు బట్టలు ఆరేయాలంటే బాల్కనీ లేదా టెర్రస్‌లే దిక్కు. ఇంకెక్కడ వేసిన ఎండ తగలదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? బాల్కనీలో బట్టలు ఆరేయ వద్దని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఆరేస్తే ఫైన్ కూడా వేస్తామని హెచ్చరించారు. ఎక్కడో తెలుసా?
వింత ఆదేశాలు
బాల్కనీలో బట్టలు ఆరబెట్టవద్దని యూఏఈలో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా హద్దు మీరి బాల్కనీలు, కిటికీలకు బట్టలు వేలాడదీస్తే ఏకంగా రూ.20వేలు జరిమానా విధిస్తామన్నారు. అపార్ట్‌మెంట్ బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని అబుదాబి మున్సిపాలిటీ అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి 1,000 దిర్హామ్‌లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 20 వేలు) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తామని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇదెక్కడి రూల్
ఈ నిబంధనపై యూఏఈ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బట్టలు ఆరబెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనలు సడలించాలని వారు కోరుతున్నారు. మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

