News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

States CMs On PM: ప్రధాని పెట్రో కామెంట్‌పై రాష్ట్రాల సీఎంలు ఫైర్- 8 ఏళ్ల నుంచి వసూలు చేసిన ట్యాక్స్‌లు పంచాలని డిమాండ్

పెట్రోల్‌ ధరలపై మరోసారి రాజకీయం మొదలైంది. ఇది రాష్ట్రాల విధిస్తున్న భారమని ప్రధాని కామెంట్ చేస్తే.. కచ్చితంగా కేంద్రం తప్పిదమే అంటున్నాయి రాష్ట్రాలు.

FOLLOW US: 
Share:

పెట్రోల్‌ ధరలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్న కేంద్రం... పన్నులు తగ్గించాలని రాష్ట్రాలకు చెప్పడమేంటని నిలదీస్తున్నాయి. 

పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు తగ్గించడం లేదని సీఎంలతో జరిగిన వర్చువల్‌ భేటీలో ప్రధాని కామెంట్ చేశారు. దీనిపై ఆయా రాష్ట్రాల సీఎంలు గట్టిగానే కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఘాటుగా బదులిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారిగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను పెంచలేదని... అలాంటప్పుడు తగ్గించాల్సింది ఎవరో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చెప్పాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్లీనరీ వేదికగా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు సీఎం కేసీఆర్. 
కేసీఆర్‌ ఏమన్నారంటే " ప్రధానమంత్రి డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారు. మూడు నాలుగు గంటలు ముఖ్యమంత్రులు అందరూ కూర్చొని ఉండాలి. వాళ్లు చెప్పేది వినాలి. కరోనా మళ్లీ విజృంభిస్తున్న టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం పెట్టారు. కానీ వాళ్లు మాట్లాడింది మాత్రం ట్యాక్సులపై. కనీసం చెప్పడానికి సిగ్గు, ఎగ్గు ఉండాలి కదా... ప్రజల మీద భారం వేయొద్దంటే మరి మీరెందుకు పెంచుతున్నారు. ఏ నోరుతో రాష్ట్రాలను తగ్గించమంటారు. ఇదేం నీతి. ఇంత దుర్మార్గమా.. ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా.. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వెందుకు పెంచినావ్‌. దేని కోసం పెంచుతున్నావ్. లేని సెస్సులు ఎందుకు మోపుతున్నావ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచలేదు. 2015లో ఒక్కసారి రౌండ్‌ ఫిగర్ చేయమని చెప్తే.. కొన్ని పైసలు అటూ ఇటూ చేసి సవరించాం. అంతే. పెట్రోల్‌, డీజిల్ ధరలు అడ్డుగోలుగా పెంచిన పాపాత్మురాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఏ నోటితో తెలంగాణకు ట్యాక్స్ కట్టాలని అడుగుతారు. మేం పెంచనే లేదు. అలాంటిది మమ్మల్ని ఎలా తగ్గించమంటావ్‌ " అని కేసీఆర్‌ మోదీని నిలదీశారు.

బలమైన కేంద్రం.. బక్క రాష్ట్రాలు అనే కుటిల నీతితో కేంద్ర పాలిస్తుందన్నారు కేసీఆర్. ఇంత నీచమైన పరిస్థితి దేశంలో గతంలో ఎన్నడూ లేదని అన్నారు. డీజీల్, పెట్రోల్‌ ధరలు పెంచుకుంటూ పోతే ఆర్టీసీ బతకాలా చావాలా అని ప్రశ్నించారు. రెండు నుంచి మూడు వేల కోట్లు ఇచ్చి తెలంగాణ ఆర్టీసీని బతికింటుంటున్నామని... అయినా దీన్ని కూడా అమ్మేయాలని మోదీ సలహా ఇస్తున్నారన్నారు. కేంద్రం అమ్మేస్తున్నట్టు ప్రభుత్వ ఆస్తులు అమ్మేయాలని ఉచిత సలహాలు మోదీ ఇస్తున్నారని మండిపడ్డారు. అలా ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వెయ్యి కోట్లు అదనంగా ఇస్తామంటూ ఆఫర్స్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. 

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ విజ్ఞప్తిలో రాజకీయ ఎజెండా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులను కేంద్రం పెంచుతూ ఇప్పుడు తగ్గించాలని రాష్ట్రాలకు చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. పశ్చిమ బెంగాల్‌  మూడేళ్లుగా రూపాయి సబ్సిడీ ఇస్తోందని దీని వల్ల పదిహేను వందల కోట్లు నష్టపోయిందన్నారు. తాము కేంద్రం తీరుతో 97వేల కోట్లు నష్ట పోయామని... అది ఇస్తే కచ్చితంగా సబ్సిడీ ఇస్తామని తేల్చేశారు మమత. 

తమిళనాడులో పెట్లోల్ ధరలపై మూడు రూపాయలు తగ్గించామని ఇప్పుడు ఇంకా తగ్గించాలని కేంద్రం చెప్పడం బాగాలేదన్నారు డీఎంకే నేతలు. సెస్‌ వాసూలు చేస్తూ దాన్ని వ్యాట్‌గా మార్చవద్దని కోరారు. పెట్రోల్‌ ప్రైస్‌పై ఎనిమదేళ్లుగా వసూలు చేసిన సొమ్ము ఎక్కడుందని ప్రశ్నించారు. 

పెట్రోల్ ధరల పెరుగుదల ముమ్మాటికీ కేంద్రం తప్పిదమే అంటున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే. ఇందులో రాష్ట్రాలను లాగి విషయాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. 

Published at : 28 Apr 2022 08:24 AM (IST) Tags: PM Modi Telangana CM KCR Petrol Price tamilanadu cm stalin VAT West Bengal CM Mamata

ఇవి కూడా చూడండి

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే

JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే

TS High Court: నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పదేపదే టీఎస్పీఎస్సీ విఫలం - హైకోర్టు ఆగ్రహం

TS High Court: నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పదేపదే టీఎస్పీఎస్సీ విఫలం - హైకోర్టు ఆగ్రహం

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

MLA Raja Singh: ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి, ఆయన తమ్ముడైనా ఓకే: రాజాసింగ్

MLA Raja Singh: ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి, ఆయన తమ్ముడైనా ఓకే: రాజాసింగ్

టాప్ స్టోరీస్

Asian Games 2023: భారత్‌ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం

Asian Games 2023: భారత్‌ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం

Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Vizag Capital :  విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Pedda Kapu Movie : 'అఖండ 2' ఉంటుంది, ప్రభాస్‌తో విరాట్ కర్ణను కంపేర్ చేయడం హ్యాపీ - 'పెద కాపు' నిర్మాత రవీందర్ రెడ్డి ఇంటర్వ్యూ

Pedda Kapu Movie : 'అఖండ 2' ఉంటుంది, ప్రభాస్‌తో విరాట్ కర్ణను కంపేర్ చేయడం హ్యాపీ - 'పెద కాపు' నిర్మాత రవీందర్ రెడ్డి ఇంటర్వ్యూ

Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?

Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?