PM Modi Exclusive Interview: ఎన్నికలపై ప్రధాని మోదీతో ఏబీపీ నెట్‌వర్క్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
PM Modi with ABP Network | లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏబీపీ నెట్ వర్క్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
PM Modi Exclusive Interview with ABP Network | న్యూఢిల్లీ: ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 6 దశలలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. చివరిదైన ఏడో ఫేజ్ పోలింగ్ జూన్ 1న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. చివరి దశ ఎన్నికలకు ముందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ABP నెట్‌వర్క్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నారు. భారీ స్థానాల్లో నెగ్గి, హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో మరోసారి అధికారం చేపడతామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఇంటర్వ్యూపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నేటి (మంగళవారం) రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవుతుంది.
ABPతో ఇంటర్వ్యూలో భాగంగా ప్రధాని మోదీ తమ ఎన్నికల నిర్వహణ శైలి, ఆయన టీమ్ వర్క్‌తో పాటు ప్రతిపక్షం గురించి పలు విషయాలు మాట్లాడనున్నారు. బ్రహ్మోస్ క్షిపణులపై జరిగిన జాప్యంతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర జరుగుతున్న పాలన, అవినీతిపై ఏబీపీ న్యూస్ ప్రతినిధులు రోహిత్ సవాల్, రొమానా ఇసార్ ఖాన్, సుమన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ స్పందించారు. రెమాల్ తుపానుపై సైతం మోదీ మాట్లాడారు. 3,000 కోట్ల అవినీతి సొమ్మును బెంగాల్‌కు తిరిగి తీసుకువస్తామన్నారు.