PM Modi Twitter: అర్ధరాత్రి మోదీ ట్విటర్ హ్యాక్.. సంచలన ట్వీట్‌తో రచ్చ, స్పందించిన ట్విటర్
ఈ వ్యవహారంపై వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పందించింది. హ్యాకర్ల ట్వీట్‌పై పీఎంవో అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను ట్విటర్ తొలగించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో వెంటనే స్పందించిన ట్విటర్ యాజమాన్యం ఆయన ఖాతాను పునరుద్ధరించింది. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో (ఆదివారం) ప్రధాని మోదీ పర్సనల్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. దేశంలో బిట్ కాయిన్‌లు లీగలైజ్ చేశామంటూ మోదీ ట్విటర్ నుంచి ట్వీట్ వెలువడింది. కాబట్టి బిట్ కాయిన్లు కొనాలంటూ గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు పోస్టులు చేశారు. భారత్‌లో ప్రభుత్వం 500 బిట్ కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింకులు కూడా పోస్ట్ చేశారు.
అయితే, ఈ వ్యవహారంపై వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పందించింది. హ్యాకర్ల ట్వీట్‌పై పీఎంవో అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను ట్విటర్ తొలగించింది. అనంతరం ప్రధాని మోదీ ట్విటర్ ఖాతాను రీస్టోర్ చేశారు. కాగా, హ్యాకింగ్ సమయంలో ట్వీట్‌లను పట్టించుకోవద్దని ప్రధాని కార్యాలయం విడిగా మరో ట్వీట్ చేస్తూ విజ్ఞప్తి చేసింది.
PM Modi's Twitter handle 'very briefly' compromised, secured later
— ANI Digital (@ani_digital) December 11, 2021
Read @ANI Story | https://t.co/Ta7MWjQUFI#Hacked #PMModi pic.twitter.com/WKWDzSmtFx
The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured.
— PMO India (@PMOIndia) December 11, 2021
In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: Gold Chain in Cow Stomach: గోల్డ్ చైన్ మింగేసిన ఆవు.. యజమాని చేసిన ఆ పనికి అంతా షాక్!
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి