(Source: ECI/ABP News/ABP Majha)
Gold Chain in Cow Stomach: గోల్డ్ చైన్ మింగేసిన ఆవు.. యజమాని చేసిన ఆ పనికి అంతా షాక్!
ఓ ఆవు యజమాని గోల్డ్ చైన్ మింగేసింది. దీంతో అతడు నెల రోజులుగా దాని పేడను వెతుకుతూనే ఉన్నాడు. గొలుసు దొరక్కపోవడంతో ఏం చేశాడో చూడండి.
ఓ ఆవు గోల్డ్ చైన్ మింగేసింది. ఈ విషయం తెలిసి యజమాని ఆందోళనకు గురయ్యాడు. 20 గ్రాముల బంగారం.. ఆవు కడుపులోకి వెళ్లిపోయిందే అంటూ తెగ బాధపడిపోయాడు. రోజూ ఆవు వేసే పేడను సేకరిస్తూ.. చాలా జాగ్రత్తగా దాని గురించి వెతికాడు. కానీ, అతడి గోల్డ్ చైన్ ఆవు కడుపు నుంచి బయటకు రాలేదు. దీంతో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. అది తెలిసి ఆ ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హీపానాహల్లీలో నివసిస్తున్న శ్రీకాంత్ హెగ్డే అనే రైతుకు నాలుగేళ్ల వయస్సు గల ఒక ఆవు, దూడ ఉన్నాయి. దీపావళిలో భాగంగా శ్రీకాంత్.. ఆవు, దూడకు స్నానం చేయించి.. గోపూజ చేశాడు. హిందూ సాంప్రదాయంలో ఆవును లక్ష్మీ దేవిగా భావిస్తారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఆవు దూడను పూల మాలలు, బంగారు చైనుతో అలంకరించాడు. పూజ తర్వాత పూల మాలలతో సహా బంగారు గొలుసును కూడా తీసి పక్కన పెట్టాడు. కొద్ది సేపటి తర్వాత చూస్తే గోల్డ్ చైన్ కనిపించలేదు. దీంతో అన్ని చోట్లా చైను కోసం వెతికారు. కానీ లభించలేదు. దీంతో ఆవే ఆ గోల్డ్ చైన్ మింగేసి ఉంటుందని సందేహించారు.
Also Read: కోపం వస్తోందా? ఈ వ్యక్తిని చితక బాదేయండి.. ఏమీ అనుకోడు.. 11 ఏళ్లుగా అతడికి అదే పని!
శ్రీకాంత్, కుటుంబ సభ్యులు వేరే పని మీద ఇంట్లోకి వెళ్లగానే ఆవు.. పూల దండలతోపాటు గోల్డ్ చైన్‌ను కూడా మింగేసి ఉంటుందని భావించారు. అప్పటి నుంచి దాదాపు నెల రోజులుగా అతడు ఆవు, ఆవు దూడ పేడలను వెతుకుతూనే ఉన్నాడు. కానీ, చైన్ దొరకలేదు. దీంతో విసుగుపోయిన శ్రీకాంత్.. ఆవును వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆవును పరిశీలించిన డాక్టర్.. ఆ గోల్డ్ చైన్ కడుపులో ఉందని తెలిపారు. అది పేడతో బయటకు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. దీంతో దానికి సర్జరీ చేసి గోల్డ్ చైన్‌ను బయటకు తీయాలని శ్రీకాంత్ కుటుంబం డాక్టర్‌ను కోరింది. మొత్తానికి వైద్యుడు ఆ ఆవుకు సర్జరీ చేసి బంగారు గొలుసును బయటకు తీశాడు. అయితే, ఇప్పుడు దాని బరువు కేవలం 18 గ్రాములే ఉంది. అందులోని చిన్న ముక్క.. ఆవు కడుపులోనే మిస్సయ్యింది. సర్జరీ వల్ల పాపం ఆ ఆవు కదల్లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడిప్పుడే అది కొలుకుంటోందని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు చెప్పారు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి