Warda Snake Bite: పాప తల వద్ద నాగుపాము.. చివరికి వెళ్తూ వెళ్తూ..
Snake Bite: వర్షా కాలంలో పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. తాజాగా చిన్నారి తల వద్ద నాగుపాము హల్ చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది.
![Warda Snake Bite: పాప తల వద్ద నాగుపాము.. చివరికి వెళ్తూ వెళ్తూ.. maharashtra snake bite young girl in her sleep at wardha selu Warda Snake Bite: పాప తల వద్ద నాగుపాము.. చివరికి వెళ్తూ వెళ్తూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/12/fd2e815ce5bfb282e8b56f4580c7d74a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వర్షా కాలం వచ్చిందంటే పాముల సంచారం పెరుగుతుంది. జనావాసాల్లోకి వస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. వార్ధాలోని సెలూ తాలూకాలోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగు పాము.. నిద్రిస్తున్న చిన్నారి పక్కన మాటువేసింది. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్న పాము.. వెళ్తూ వెళ్తూ చిన్నారిని కాటేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెలూ తాలూకాకు చెందిన పూర్వ గడ్కరీ (6) అనే బాలిక తన తల్లితో కలిసి నిద్రపోయింది. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో పూర్వ తల్లికి ఏదో తట్టినట్లుగా అనిపించింది. వెంటనే లేచి చూడగా.. పాప పక్కన నాగుపాము కనిపించింది. దీంతో పక్కకు వెళ్లిపోయింది. అయితే పూర్త అప్పటికే నిద్రలో ఉండటంతో వెంటనే లేవలేకపోయింది.
2 గంటల పాటు..
అప్రమత్తమైన పూర్త తల్లి.. చుట్టుపక్కల వారిని పలిచింది. వారంతా వచ్చి చూడగా, పాము పూర్వ పక్కనే విడగ విప్పి కూర్చుంది. దాదాపు 2 గంటల పాటు పాము అలా పడగ విప్పి నిల్చుని ఉంది. పూర్వ కూడా మెలకువగానే ఉంది. అయితే ఏ మాత్రం కదిలినా పాము కాటు వేసే ప్రమాదం ఉండటంతో ఆమె అలానే పడుకుని ఉంది. చుట్టుపక్కల వారు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. పాము దానంతట అదే వెళ్లిపోయేంత వరకు నిశబ్దంగా ఉండాలని అనుకున్నారు.
వెళ్తూ వెళ్తూ కాటేసింది..
నిమిషాల్లోనే వెళ్తుందనుకున్న పాము రెండు గంటల వరకు అక్కడే ఉంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పూర్వ ఇంటికి చేరడంతో జనాల తాకిడి పెరిగింది. జనాలను చూసి భయపడిన పాము కదిలింది. అయితే వెళ్తూ.. వెళ్తూ.. చిన్నారిని కాటేసింది. పాము బయటకు వెళ్లిన వెంటనే పూర్వని సేవాగ్రామ్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పూర్వ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. అక్కడ ఉన్న వారు దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Warda Snake Bite Video Here:
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)