అన్వేషించండి

NEET 2021: ఇవాళ నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్షకు వెళ్లేముందు ఈ గైడ్ లైన్స్ ఒక్కసారి చూసుకోండి..

నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్ ) పరీక్ష ఈరోజు(సెప్టెంబర్ 12) జరగనుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది.


నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్నీ 2021 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) వెల్లడించింది. నీట్ యూజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలలో ఎండీ, ఎంఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులలో చేరవచ్చు. ఎయిమ్స్, పీజీఐఎంఈఆర్ (PGIMER), NIMHANS, SCTIMST, JIPMER తప్ప మిగతా అన్ని మెడికల్ కాలేజీలు, వర్సిటీలలో ప్రవేశాలు పొందవచ్చు. 


వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా నీట్ జరగనుంది. కోవిడ్ కారణంగా ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచారు. నీట్ పీజీ అడ్మిట్ కార్డుతో పాటు.. ఎన్‌బీఈ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వీటిని తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. అడ్మిట్ కార్డులో ఇచ్చిన రిపోర్టింగ్ సమయం ప్రకారం రిపోర్టింగ్ చేయాలని అభ్యర్థులకు సూచించింది. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు రిపోర్టింగ్ కౌంటర్ మూసివేస్తారని పేర్కొంది. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష  జరుగుతుంది.

దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో ఏడు, ఏపీలో తొమ్మిది పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హయత్ నగర్ పట్టణాల్లో 112 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి పట్టణాల్లో 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్ టీఏ వెల్లడించింది.

నీట్ పరీక్ష గైడ్ లైన్స్ ఇవే..

  • కోవిడ్ 19 మహమ్మారి కారణంగా, అభ్యర్థులంతా పరీక్షా కేంద్రంలో సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది.
  • ఫేస్ మాస్క్ లేకుండా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
  • అభ్యర్థులు అడ్మిట్ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం తప్పనిసరి. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.
  • రిజిస్ట్రేషన్ డెస్క్ వద్ద అందించిన శానిటైజర్‌ని ఉపయోగించి అభ్యర్థులు తమ చేతులను శానిటైజ్ చేసుకోవాలి. 
  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి శరీర ఉష్ణోగ్రతను థర్మో గన్‌ సాయంతో ఎంట్రీ గేట్ వద్ద పరీక్షిస్తారు. 
  • కోవిడ్ లక్షణాలు కనిపించిన, జ్వరంతో బాధపడుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక గదిని కేటాయించారు. అక్కడ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించారు. 
  • పరీక్ష రాసే అభ్యర్థులు తమతో పాటు ఎలాంటి డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వంటి పలు నిషేధిత వస్తువులను తీసుకురాకూడదు. ఏదైనా వస్తువుతో పరీక్ష హాల్ లోకి ప్రవేశించిన అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.

నీట్ పరీక్షలో ఈ ఏడాది 200 ప్రశ్నలు ఉంటాయి. 180 ప్రశ్నలకే సమాధానం ఇస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సమాన మార్కులు వస్తే నెగెటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికే ర్యాంకులో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్​టీఏ నిర్ణయించింది. నీట్ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా 83 వేల 75 ఎంబీబీఎస్, 26,949 బీడీఎస్, 52,720 ఆయుష్, 525 బీవీఎస్, ఏహెచ్, 1899 ఎయిమ్స్, 249 జిప్​మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.

Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వ‌చ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచ‌ర్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget