News
News
X

శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వ‌చ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచ‌ర్లు!

శాంసంగ్ త‌న కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ వైడ్ 5ను ద‌క్షిణ కొరియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మ‌న‌దేశంలో గెలాక్సీ ఎఫ్42 5జీ పేరుతో లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది.

FOLLOW US: 
Share:

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 స్మార్ట్ ఫోన్ ద‌క్షిణ‌కొరియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇత‌ర దేశాల్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ పేరుతో లాంచ్ కానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో వాట‌ర్ డ్రాప్ త‌ర‌హా డిస్ ప్లే అందించారు. 64 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇందులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ధ‌ర‌
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో వ‌చ్చిన ఈ వేరియంట్ ధ‌ర‌ను 4,49,900 వాంగ్ లుగా(మ‌న‌దేశ క‌రెన్సీలో సుమారు రూ.28,200) నిర్ణ‌యించారు. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 స్పెసిఫికేష‌న్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వీ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ టెర్టియ‌రీ సెన్సార్ కూడా ఉండనున్నాయి.

ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్నిమైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

దీని మందం 0.9 సెంటీమీటర్లుగానూ, బరువు 203 గ్రాములుగానూ ఉంది. SM-E426S మోడ‌ల్ నంబ‌ర్ తో ఈ ఫోన్ లాంచ్ అయింది. SM-E426B మోడ‌ల్ నంబర్ తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ రానుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కాబ‌ట్టి ఈ ఫోనే గెలాక్సీ ఎఫ్42 5జీగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ ఫోన్ మ‌న‌దేశంలో రూ.20 వేల‌లోపు ధ‌ర‌తోనే లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది.

Also Read: జియో ఫోన్ సేల్ వాయిదాకు కార‌ణం ఇదే.. ల్యాప్‌టాప్‌ల రేట్లు పెరిగే అవ‌కాశం!
Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వ‌చ్చేస్తున్నాయి.. ఈసారి మ‌రిన్ని కొత్త రంగుల్లో!
Also Read: గుడ్ న్యూస్.. ఈ బ‌డ్జెట్ రియ‌ల్ మీ ఫోన్ పై భారీ ఆఫ‌ర్.. ఏకంగా రూ.6 వేల వ‌ర‌కు!

Published at : 11 Sep 2021 07:22 PM (IST) Tags: samsung smartphone Samsung Galaxy Wide 5 Samsung Galaxy Wide 5 Price Samsung Galaxy Wide 5 Specifications Samsung Galaxy Wide 5 Features Samsung Galaxy Wide 5 Launched Samsung New Phone

సంబంధిత కథనాలు

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు,  జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌, ఫీచర్లు కూడా అదుర్స్

C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌, ఫీచర్లు కూడా అదుర్స్

iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?

iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?