Kerala OTT : కేరళ ప్రభుత్వ సొంత "ఓటీటీ" - ఇక సినిమాలన్నీ అందులోనేనా ?
కేరళ ప్రభుత్వం సి-స్పేస్ పేరుతో సొంత ఓటీటీ ప్రారంభిస్తోంది. రెవిన్యూ షేరింగ్ ప్రాతిపదికన ఇందులో సినిమాలను అందుబాటులో ఉంచుతారు.
Kerala OTT : ఓటీటీ సేవల రంగంలోకి తొలి సారి ఓ రాష్ట్ర ప్రభుత్వం వస్తోంది. నవంబర్ 1 నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించాలని నిర్ణయించింది. 'సీ స్పేస్' ( CSPCAE ) పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, జాతీయంగా, అంతర్జాతీయంగా అవార్డులు గెలిచిన సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు ఉంటాయి. రస్తుతమున్న ఓటీటీలకు భిన్నంగా ఈ ఓటీటీలో కొన్ని ఫీచర్లను పొందుపరచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఓటీటీని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( KSFDC ) నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఓటీటీని ప్రారంభించడం ఓ కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని, అలాగే మలయాళ సినిమా అభివృద్ధికి సహాయపడుతుందని ప్రభుత్వం ప్రకటించిది.
సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
కొత్త ఓటీటీ ద్వారా సినిమా వ్యాపారానికి ఎలాంటి సంక్షోభం తలెత్తదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. సినిమాలను థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే.. 'సీ స్పేస్'లో ప్రసారం చేయడం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. 'సీ స్పేస్' లాభాల భాగస్వామ్యంతోపాటు, అత్యాధునిక సాంకేతిక నాణ్యతను నిర్ధారించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 'సీ స్పేస్'లో ప్రసారం చేయబోయే సినిమాల రిజిస్ట్రేషన్ జూన్ 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
'సీ స్పేస్... నిర్మాతలకు, వారి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్ వంటి దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందేలా చేస్తుందని చెబుతున్నారు. కేరళ ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించి... ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అక్కడి ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ ఓటీటీలో ఒక నిర్దిష్టమైన సినిమాను వీక్షించాలనుకునే వారు డబ్బు చెల్లించి ఆ సినిమాను వీక్షించాల్సి ఉంటుంది. ప్రేక్షకులు ఇచ్చిన మొత్తంలో ఒక భాగం నిర్మాతకు వెళుతుంది అని కెఎస్‌ఎఫ్‌డిసి ప్రకటించింది.
భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
రెవిన్యూ షేరింగ్ ఝ ( Pay per View ) ప్రాతిపదికిన ఈ ఓటీటీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే... సినిమాలకు ఎలాంటి రైట్స్ డబ్బులు పెట్టే కొనే అవకాశం ఉండదని భావిస్తున్నారు. దీనిపై కేరళ సినీ పరిశ్రమ స్పందన ఏమిటో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఎందుకు ఈ ఓటీటీల వ్యాపారం అని విమర్శించేవారు కూడా ఉన్నారు.