అన్వేషించండి

DK Shivakumar First Cabinet Meeting:డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!

DK Shivakumar First Cabinet Meeting:విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్‌లు జారీ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ తెలిపారు. 10,000కుపైగా భారత్ జోడో యువజన సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 

DK Shivakumar First Cabinet Meeting:కర్ణాటక రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభమైంది. మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత పవర్ ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ పూర్తి చేసుకొని, రాష్ట్ర పగ్గాలు చేపట్టిన శివకుమార్ తనదైన శైలిలో పాలనను పరుగులు తీయిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిర్వహించిన తొలి మంత్రివరర్గ సమావేశంలో ప్రజల మనసు గెలుచుకునే, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త శకాన్ని ప్రారంభించేందుకు కేబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ నాది కాదని, కర్ణాటక ప్రజలదని డీకే శివకుమార్ అన్నారు. ప్రజాస్వామ్య నాలుగు స్తంభాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. 

విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్‌లు జారీ చేస్తామని శివకుమార్ తెలిపారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు 10,000కు పైగా భారత్ జోడో యువజన సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

బెంగళూరు రోడ్లపై 2,000 కోట్ల రూపాయలు ఖర్చు 

దేశ ఐటీ రాజధానిలో రోడ్లను మెరుగుపరచడానికి ₹2,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శివకుమార్ ప్రకటించారు. బెంగళూరు ఇప్పుడు ఐటీ శక్తిని మాత్రమే కాకుండా గుంతలు, ట్రాఫిక్ జామ్‌లతో కూడా వరల్డ్ ఫేమస్ అయిపోయిందని ఆయన అన్నారు. దీంతోపాటు అక్రమ రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోందన్నారు. త్వరలో అన్నింటికి పరిష్కరించేందుకు కొత్త ఆలోచనలతో వస్తామని తెలిపారు.  

సుప్రీంకోర్టు ఉత్తర్వును ఉటంకిస్తూ, మున్సిపల్ సంస్థలు దీనిని తప్పనిసరి చేశాయని డీకేఎస్ అన్నారు. ఆమోదించిన పరిమితిని మించిన ఎత్తు లేదా ఇతర కొలతలు ఉన్న ఆస్తులకు నీటి, విద్యుత్ కనెక్షన్లు నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులో పేర్కొన్నట్టు గుర్తుచేశారు. 

ప్రణాళిక లేకుండా ఇళ్లు 

బెంగళూరులో ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇళ్లను నిర్మించారని డీకే అన్నారు. అటువంటి ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. 30 నుంచి 40 ప్రాంతాలకు సీసీ/ఓసీలు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.                    

అదనంగా, 2,500 చదరపు అడుగుల వరకు ఉన్న ఆస్తుల కోసం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కల్పిస్తారు. యువతకు ఉద్యోగాలకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం 50,000 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget