(Source: Poll of Polls)
President Kovind on Covid19: నిజమైన దేశభక్తులు సైనికులే.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కోవింద్
కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు సాదాసీదాగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించారు.
73వ రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని దూర్‌దర్శన్, ఆల్‌ఇండియా రేడియో ప్రపంచానికి వినిపించాయి. మన ప్రజాస్వామ్యంలోని వైవిధ్యం, చైతన్యం ప్రపంచమే ప్రశంసిస్తోందన్నారు రాష్ట్రపతి.
"ఒకే జాతి అనే స్పిరిట్‌ను ప్రతి ఏడాది రిపబ్లిక్‌డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఏడాది కరోనా కారణంగా చాలా నార్మల్‌గా జరుపుకుంటున్నాం. కానీ స్పిరిట్ మాత్రం తగ్గలేదు." - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
"దేశభక్తిని మన సైనికులు ముందుకు తీసుకెళ్తున్నారు. రాత్రి పగలు నిద్రహారాలు లేకుండా దేశాన్ని, దేశ ప్రజలను మన జవాన్లు, పోలీసులు కాపాడుతున్నారు. వాళ్ల కృషి కారణంగానే సరిహద్దుల్లో, దేశంలో శాంతి పరిఢవిల్లుతోంది. దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు." - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
కరోనా ప్రోటోకాల్ పాటించడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు రాష్ట్రపతి కోవింద్.
Full text of the address of the President of India, Shri Ram Nath Kovind, on the eve of the 73rd #RepublicDay.
— President of India (@rashtrapatibhvn) January 25, 2022
English: https://t.co/gELEQGysfA
Hindi: https://t.co/CVHWuCVMhD pic.twitter.com/TJAwE5vWUT
"మనం ఓ మహమ్మారితో పోరాడుతున్నాం. ఈ టైంలో కరోనా ప్రోటోకాల్ పాటించడం మనందరి విధి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా రోగులను కాపాడుతున్నారు. "- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
"ప్రాథమిక బాధ్యతలు నిర్వహిస్తూ మన స్థాయిలో మనం దేశ సేవ చేయాలి. కోట్ల మంది ప్రజలకు ముందుకొచ్చి స్వచ్ఛభారత్ అభియాన్, కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఓ మహోద్యమంలా మార్చారు." - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
"వైరస్ తన రూపాన్ని మార్చుకొని మానవాళిపై తిరుగుబాటు చేస్తోంది. లెక్కలేనన్ని కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. బాధను వ్యక్తం చేయడానికి మాటలు చాలడం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్లను రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యం కావాలి." - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
The 21st century is turning out to be the age of climate change, and India has taken a leadership position on the world stage in showing the way, especially with its bold and ambitious push for renewable energy. pic.twitter.com/VOIEDXEhl2
— President of India (@rashtrapatibhvn) January 25, 2022
మహమ్మారి ఇంకా విస్తృతంగా వ్యాపిస్తోందని, మనం అప్రమత్తంగా ఉండాలని, అజాగ్రత్త వద్దని హితవులు పలికారు రాష్ట్రపతి కోవింద్. ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలను కొనసాగించాలని అన్నారు.
స్వరాజ్యం కోసం శ్రమించి ప్రజలను ఆ దిశగా నడిపించిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్బంగా స్మరించుకున్నారు రాష్ట్రపతి కోవింద్.
India is an ancient civilisation but a young republic. For us, nation-building is a constant endeavour. As in a family, so in a nation; one generation works hard to ensure a better future for the next generation. pic.twitter.com/uqaAsNsSJn
— President of India (@rashtrapatibhvn) January 25, 2022
రిపబ్లిక్‌డే 2022 వేడుకలు చాలా సాధారణంగా జరుగుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ చాలా ఉద్ధృతంగా ఉన్న సింపుల్‌గా వేడుకలు జరపడానికి నిర్ణయించింది ప్రభుత్వం.
In this 75th year of Independence, let us re-discover the values that animated our glorious national movement. pic.twitter.com/xtiecG0Vha
— President of India (@rashtrapatibhvn) January 25, 2022
ఉదయం పదిన్నరకు రాజ్‌పథ్ వద్ద సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వేడుకులకు డబుల్ డోస్ వేసుకున్న వాళ్లనే అనుమతిస్తున్నారు. 15ఏళ్ల లోపు పిల్లలను రానివ్వడం లేదు.
సాధారణంగా కవాతు చూసేందుకు అవకాశం లేని వర్గాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌తోపాటు 'బీటింగ్ రిట్రీట్' వేడుకను చూడటానికి ఆటో-రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, సఫాయి కర్మచారిలు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను ఆహ్వానించారు.