అన్వేషించండి

India at 2047 Summit Live: ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా 2047 సమ్మిట్ ప్రారంభం.. చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోదీ, లైవ్ వీక్షించండి

PM Modi vision for Vikasit Bharat | భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ పలుమార్లు చెప్పారు. నేడు ఏబీపీ నెట్వర్క్ సదస్సులో ఆయన పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.

ABP Network India@2047 Summit: ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికత కలిగిన దేశామైన భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రపంచ వేదికపై భారతదేశం కీలక పాత్రను పోషిస్తోంది. సరికొత్త సవాళ్లను ఎదుర్కొని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చోటు కోసం నిరంతరం కృషి జరుగుతోంది. భాతదేశం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని.. స్వాతంత్య్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తిచేసుకుకోనున్న శుభ సమయంలో ఆ కల సాకారం కావాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. 

అందులో భాగంగానే వందేళ్లకు పైగా అనుభవం ఉన్న ఏబీపీ న్యూస్ నెట్‌వర్క్ శత వసంత భారతానికి ఘన స్వాగతం పలుకుతోంది. నేడు (మే 6వ  తేదీన) ఢిల్లీలోని భారత మండపంలో ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న India@2047  కాంక్లేవ్ ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ డైరెక్టర్ ధృబ ముఖర్జీ వెల్కమ్ స్పీచ్‌తో సమావేశాన్ని ప్రారంభించారు, భారత్ స్వాతంత్య్రం పొంది 2047లో శతాబ్దం పూర్తి చేసుకోనుందని.. '2047లో ఏమి ఆశించాలి?' ('What to expect in 2047?') అనే  అంశంపై పలు సెషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొని తమ అభిప్రాయాలు షేర్ చేసుకోనున్నారు. నేటి సాయంత్రం ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను ABP నెట్‌వర్క్ ఈ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. భారత్ @2047 రోడ్‌మ్యాప్‌పై భవిష్యత్ లక్ష్యాలను మోదీ ప్రస్తావించనున్నారు.

ABP నెట్‌వర్క్ ఈ సదస్సు ద్వారా భారతదేశాన్ని ముందుకు నడిపించే భవిష్యత్ ఆలోచనలను, పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వేదికను అందిస్తుంది. ఇండియా @ 2047లో పలు రంగాల ప్రముఖుల ఆలోచనల సమ్మేళనం జరుగుతుంది. భారతదేశం 2047లో స్వాతంత్ర్యం 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రపంచ వ్యాప్తంగా మేటి దేశంగా, నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా మారాలని వ్యూహాలు రచిస్తోంది. 

ABP నెట్‌వర్క్ సదస్సు కాస్త భిన్నంగా కనిపిస్తుంటుంది. ఎందుకటే ఇది కేవలం ఒక చర్చా వేదిక మాత్రమే కాదు. కొందరు ప్రముఖుల ఆలోచనల సమాహారం. ఇది రాబోయే సంవత్సరాలలో  ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని నిర్దేశించే దిశగా స్పష్టమైన, సరైన లక్ష్యంతో ముందుకు సాగడానికి సదస్సు ప్రేరేపిస్తుంది.

ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథి

ABP నెట్‌వర్క్ ప్రత్యేక కార్యక్రమం India@2047 SUMMIT లో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు, భవిష్యత్ నిర్దేశకులు ఈ సమ్మిట్‌లో  పాల్గొంటున్నారు. భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, టీవీ హోస్ట్ బేర్ గ్రిల్స్, అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా, రేమాండ్స్ ఎండీ గౌతమ్ సింఘానియా, బాక్సర్ లవ్లీనా బోర్గోహోం, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.

ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చూడండి

ABP న్యూస్ (హిందీ)- https://www.abplive.com/
ABP న్యూస్ (ఇంగ్లీష్)- https://news.abplive.com/
ABP న్యూస్ యూట్యూబ్- https://www.youtube.com/watch?v=nyd-xznCpJc

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget